బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా..!

– Advertisement –

నవతెలంగాణ – హైదరాబాద్: బీసీసీఐలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో జరగనున్న బీసీసీఐ ఎన్నికల వరకు శుక్లా ఈ పదవిలో కొనసాగుతారు. నేషనల్ మీడియా కథనాల మేరకు బుధవారం నిర్వహించిన బీసీసీఐ అపెక్స్ కౌన్సెల్ సమావేశం రాజీవ్ శుక్లా నేతృత్వంలో జరిగింది.. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో రోజర్ బిన్నీ మళ్లీ పోటీ చేసి గెలిస్తే అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో సెప్టెంబర్ తర్వాత బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు రానున్నారు.

– Advertisement –

Leave a Comment