Best YouTube channels for kids: ప్రస్తుత కాలంలో మొబైల్ చూడకుండా పిల్లలు ఉండలేకపోతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఆహారం తినిపించడం కోసం.. లేదా హోం వర్క్ కంప్లీట్ చేయడం కోసం.. మొబైల్లో తప్పకుండా చూపిస్తున్నారు. అయితే ఎక్కువగా వీడియోలు చూడడం కోసం యూట్యూబ్ ను వాడుతూ ఉంటారు. ఇది అలవాటుగా మారిన వారు రకరకాల వీడియోలు చూస్తున్నారు. ఈ వీడియోలతో వారి మెదడు ఒక్కోసారి తప్పుదారి కూడా పట్టే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా మొబైల్ చూసే పిల్లలకు కొన్ని రకాల మంచి వీడియోస్ చూడడం వల్ల వారి జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దవచ్చు. అలాంటి వీడియోస్ కోసం కొంతమంది తల్లిదండ్రులు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివారు ఈ మూడు రకాల వీడియోలను తప్పకుండా చూపించాలి. అవేంటంటే?
Mummy And daddy:
ఈ ఛానల్ లో పిల్లలకు మంచి అవార్డులను ఎలా ఇస్తారు? అవార్డులను ఎలా తెచ్చుకోవాలి? అవార్డుల కోసం ఎలా కృషి చేయాలి? అనే విషయాలను చెబుతూ ఉంటారు. బొమ్మల ద్వారా ఈ విషయాలను చెప్పడం వల్ల పిల్లలకు చక్కగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోల్లో డిస్ప్లేన్ గురించి చెబుతూ ఉంటారు. నేటి కాలంలో చాలామంది పిల్లల్లో ఇది కరువు అవుతుంది. ఈ వీడియోలు చూడడం వల్ల వారు డిస్ప్లేన్ గురించి తెలుసుకుంటారు. అలాగే మంచి అలవాట్లు ఎలా ఉంటాయి? వాటిని ఎలా పాటించాలి? అనే విషయాలు చెబుతారు. ఇవే కాకుండా వారి సేఫ్టీ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలను కూడా ఇందులో చక్కగా వివరిస్తూ ఉంటారు. అందువల్ల ఈ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూపించండి.
Rock N Learn:
ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ తప్పనిసరి. భవిష్యత్తులో ఇంగ్లీష్ లేకపోతే బతకడం కష్టమే అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇప్పటినుంచి పిల్లలకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉండాలి. ఇలాంటి వారి కోసం ఈ ఛానల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో పిల్లలకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటారు. వీటి ద్వారా వాళ్లు ఇంగ్లీషును సులభంగా నేర్చుకుంటారు. దీంతో స్కూల్లో చెప్పే పాఠాలు కూడా చక్కగా అర్థం అవుతాయి. అందువల్ల ఈ వీడియోను కూడా పిల్లలకు తప్పకుండా చూపించండి.
Smile And Learn:
పిల్లలకు ఉపయోగపడే మరో యూట్యూబ్ ఛానల్ స్మైల్ అండ్ లెర్న్. ఇందులో విద్యకు సంబంధించిన అన్ని విషయాలను చెబుతూ ఉంటారు. అలాగే జీవితంలో సక్సెస్.. ఫెయిల్యూర్ గురించి చక్కగా వివరిస్తారు. అందువల్ల విరామ సమయంలో ఈ వీడియోలను తప్పకుండా చూపించవచ్చు.
ఎంత కట్టడి చేసినా మొబైల్ చూడకుండా పిల్లలు ఉండడం లేదు. అయితే వారిని ఇటువంటి చానల్స్ వైపు డైవర్ట్ చేయడం వల్ల వారి లైఫ్ సెట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారు మానసికంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అందువల్ల ఈ మూడు వీడియోలను వారికి చూపించి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించే ప్రయత్నం చేయండి.
[