– Advertisement –
టీం ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) తన కెరీర్‌లో ఎన్నో అత్యద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. చాల సందర్భాల్లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. జట్టును విజయతీరాలకు చేర్చడంలో షమీ ఎప్పుడు ముందుంటాడు. అయితే కెరీర్‌లో టాప్ స్థాయిలో ఉన్నా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు ఎదురుకున్నాడు. తన భార్య హసీన్ జహాన్ షమీపై ఎన్నో ఆరోపణలు చేసింది. ఆ తర్వాత విడాకులు వాళ్లిద్దరూ తీసుకున్నారు.
అయితే ఇప్పటివరకూ షమీ (Mohammed Shami) ఈ విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ, తొలిసారిగా ఈ విషయంపై షమీ స్పందించాడు. ఇటీవలే కోల్‌కతా కోర్టు వీరి విడాకుల విషయంపై తీర్పు వెలువరించింది. హసీన్ జహాన్‌కు నెలకు రూ.4 లక్షలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించింది. దీని గురించి షమీ మాట్లాడుతూ.. ‘‘ఆ విషయాన్ని వదిలేడమే మంచిది. గతం గురించి నేనెప్పుడు ఆలోచించను. జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయంలో నేను ఎవరినీ నిందిచను. నన్ను నేను కూడా నిందించుకోను. ప్రస్తుతం నా దృష్టి అంతా క్రికెట్‌పైనే ఉంది. అలాంటప్పుడు వివాదాల్లో తలదూర్చడం మంచిది కాదు’’ అని షమీ స్పష్టం చేశాడు.
Also Read : రిటైర్మెంట్ ఆలోచన లేదు:మహ్మద్ షమి
– Advertisement –