డబుల్ సెంచరీతో చెలరేగిన యువ క్రికెటర్.. తొలి ఆటగాడిగా రికార్డు

– Advertisement –

దులీప్‌ ట్రోఫీ-2025 హోరాహోరీగా సాగుతోంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్‌లో సెంట్రల్‌ జోన్ ఆటగాడు డానిష్ మలేవర్ (Danish Malewar) చెలరేగిపోయాడు. నార్త్ ఈస్ట్‌ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో డానిష్ డబుల్ సెంచరీ చేశాడు. వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేసి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 21 ఏళ్ల ఈ యువ క్రికెటర్ ఈ మ్యాచ్‌లో 222 బంతుల్లోనే ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 222 బంతుల్లో 36 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 203 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అంతేకాక దులీప్ ట్రోఫీలో ఆరంగేట్ర మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ చేసిన తొలి విదర్భ ప్లేయర్‌గా డానిష్ (Danish Malewar) నిలిచాడు తొలి ఇన్నింగ్స్‌లో మాలేవర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో సెంట్రల్ జోన్ 532 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సెంట్రట్ జోన్ 18 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 58 పరుగులు చేసింది. ఆధిక్యం కోసం సెంటల్ జోన్ ఇంకా 474 పరుగులు చేయాల్సి ఉంది.

Also Read : జైస్వాల్ కాదు అని ఆటగాడిని ఎందుకు తీసుకున్నారు: కృష్ణమాచారి శ్రీకాంత్

– Advertisement –

Leave a Comment