జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణ‌కు రూ.7వేల కోట్లు నష్టం: ఆర్థిక మంత్రి భట్టి

– Advertisement –

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రానికి రూ.7వేల కోట్లు నష్టం వస్తుందని అంచనా ఉన్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఢిల్లీలో జరిగిన ‘జీఎస్టీ సంస్కరణలపై ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రాల సమావేశం’లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ తరఫున భట్టి విక్రమార్క హాజరుకాగా.. తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే నష్టానికి పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా మంత్రులు డిమాండ్‌ చేశారు. కొత్త జీఎస్టీ ప్రతిపాదనలతో మొత్తంగా రూ.2లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు. జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో తమ ప్రతిపాదనలు సమర్పిస్తామని చెప్పారు.

– Advertisement –

Leave a Comment