Chiranjeevi Daughter Sushmitha: మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప పేరు ప్రఖ్యాతలను తీసుకురావడమే కాకుండా గత 50 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గా తనకున్న హోదాని నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ప్లేస్ ను రీప్లేస్ చేసే హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక యాక్టింగ్ లోను తను కొట్టేవారు ఇంకొకరు లేరు అనేది వాస్తవం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు అయిన సుష్మిత ప్రస్తుతం చిరంజీవి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తుంది. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆమె కెరియర్ మొదట్లోనే సినిమా ఇండస్ట్రీకి రావాలని చాలా వరకు ప్రయత్నం చేశారు. ఇక దానికి తగ్గట్టుగానే హీరోయిన్ గా చేయడానికి చిరంజీవి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తనకు యాక్టింగ్ కూడా నేర్పించారు. మరి మొత్తానికైతే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆమె ఒక సినిమా చేయాల్సి ఉంది.ఆ సినిమా మొదటి షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది.
Also Read: టీఆర్పీ రేటింగ్స్ : బ్రహ్మముడి అధ: పాతాళానికి.. వంటలక్క టాప్ లోకి
ఆ షెడ్యూల్లో సుష్మిత యాక్టింగ్ అంత పెద్దగా ఇంప్రెస్సివ్ గా లేకపోవడంతో అల్లు అరవింద్, చిరంజీవి కలిసి ఆ సినిమాని అక్కడితోనే ఆపేశారు. ఇక దానికి తగ్గట్టుగానే సుష్మిత కు డిజైనింగ్ సంబంధించిన కోర్సు నేర్చుకోమని చెప్పి తనకి ఆ కోర్స్ లో శిక్షణను ఇప్పించారు.
ఇక చిరంజీవి హీరోగా వచ్చిన ఇంద్ర సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా తనే వర్క్ చేస్తూ ఉండటం విశేషం… మరి చిరంజీవి వేసుకునే కాస్ట్యూమ్స్ అయితే అద్భుతంగా ఉంటున్నాయి. దానికి సుష్మిత కి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. ఇక మొత్తానికైతే మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోయిన్ గా సుస్మిత ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేసినప్పటికి అది వర్కౌట్ కాలేదు.
ఇక ఈమె తర్వాత నాగబాబు బిడ్డ నిహారిక కూడా నటిగా తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికి ఆమె కూడా అంత పెద్దగా క్లిక్ కాకపోవడంతో మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే సెట్ ఇండస్ట్రీ కి అవుతారు. హీరోయిన్లుగా తమ బిడ్డలు పనికిరారనే ఉద్దేశంతో మెగా హీరోలు వాళ్ళు మాత్రమే ముందుకు వస్తుండటం విశేషం…