– Advertisement –
బాసర: నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆలయ అర్చకులు వైదిక బృందం ఆధ్వర్యంలో శుక్రవారం శాంతించమ్మా..! గోదారమ్మ అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద నుంచి గోదావరి నది వరకు మేళతాళాల మధ్య చేరుకొని గోదావరి నదీమ తల్లికి పట్టుచీర, వాయినం, నైవేద్యాన్ని సమర్పించారు. గోదావరి నది శాంతించి దేశం, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించవద్దని వేడుకున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. గత రెండు రోజుల వరదలలో చిక్కుకొని పది మంది మృతి చెందిన విషయం విధితమే.
– Advertisement –