అమరావతి: కదులుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నంలో జరిగింది. శాంతిపురం బస్టాండ్ సమీపంలోకి రాగానే బస్సులో మంటల రావడంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులను బస్సు నుంచి దింపేశాడు. చూస్తుండగా బస్సు మంటల్లో కాలిపోయింది. బస్సు డ్రైవర్, కండక్టర్ సిబ్బంది మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. షార్ట్ సర్కూట్‌తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Also Read: టివి నటుడు లోబోకు జైలుశిక్ష