ఇలాంటి వారిని హద్దుల్లో పెట్టకపోతే నష్టం మీకే..

ఇలాంటి వారిని హద్దుల్లో పెట్టకపోతే నష్టం మీకే..

Control negative people in life: సమాజంలో మానవ సంబంధాలు బాగుండాలని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. ఇందుకోసం ఎదుటివారికి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ పనులు నచ్చకపోయినా చేయాల్సి వస్తుంది. ఇలాంటి అప్పుడు ఎదుటివారు సంతోషపడతారు.. కానీ చేసిన వారు మాత్రం ఆవేదనకు గురవుతారు. ఈ విషయంలో భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరైనా కావచ్చు.. కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకొని అంతవరకు మాత్రమే సహాయం చేయడం.. లేదా పనులు చేయడం మంచిది. లేకుంటే లేనిపోని కష్టాల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇది జీవితంపై ఎంతో ప్రభావం పడుతుంది. మరి ఎలాంటి హద్దులను ఏర్పరుచుకోవాలి? ఎవరితో ఎలా ప్రవర్తించాలి?

కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు అనవసరపు విషయాల్లో కలగజేసుకుంటూ ఉంటారు. ఇలా అవసరం లేని వాటిలో తల దూర్చడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ విషయంలో కనుక ఉద్యోగులు ఫెయిల్ అయితే విలువ పోతుంది. అందువల్ల అనవసరపు విషయాల్లో మాట్లాడకుండా ఉండడమే మంచిది. ప్రతి ఒక్కరికి సమయం చాలా విలువైనది. కొందరి కోసం సమయాన్ని వృథా చేసుకుంటూ ఉంటారు. ఇతరుల కోసం సమయాన్ని వృథా చేసుకోవడం వల్ల మీ జీవితం నాశనమయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఏదైనా పని చేయాలని చెబితే.. సున్నితంగా నో అని చెప్పండి. అలా చెప్పడం ద్వారా ఎంతో భారం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.

జీవిత భాగస్వామి విషయంలో కొన్ని హద్దులను ఏర్పాటు చేసుకోవాలి. పదేపదే గొడవ అవుతూ ఉంటే.. కొన్ని విషయాల్లో దూరంగా ఉండటమే మంచిది. అలా ఉండడం వల్ల ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. మరోసారి గొడవ కాకుండా ఉంటుంది. అయితే ఈ బౌండరీలు ఇద్దరికీ సౌఖ్యంగా ఉండేవిధంగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి డబ్బు చాలా ప్రధానమే. కానీ కొందరి దగ్గర తక్కువగాను.. మరికొందరు దగ్గర ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో కొందరు అవసరాల కోసం డబ్బు అడుగుతుంటారు. అయితే మీ అవసరాలకు తగిన డబ్బు కంటే ఎక్కువగా ఉంటే.. ఎదుటివారు మంచివారు అని మీరు భావిస్తే డబ్బు సహాయం చేయవచ్చు. అలా కాకుండా మీ దగ్గర డబ్బు లేకుండా సహాయం చేయడం ఏమాత్రం సరికాదు. ఎందుకంటే డబ్బు తీసుకున్న వ్యక్తి సరైన సమయానికి ఇవ్వకపోతే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అందువల్ల ఈ విషయంలో హద్దులు కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి.

కొందరు తల్లిదండ్రులు తమ ఆలోచనలకు అనుగుణంగా ఉండాలని పిల్లలపై ఒత్తిడి తెస్తారు. అయితే పిల్లలు తమకు ఇష్టమైనదే చేయడం మంచిది. ఎందుకంటే ఇష్టం లేకుండా చేయడం వల్ల భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుంది. ఇందుకుగాను ముందుగానే ఇష్టంగా చేస్తానని చెప్పడం మంచిది. కొందరు దగ్గరివారైనా సరే.. ఒక్కోసారి హేళనగా మాట్లాడుతూ ఉంటారు.. బనాయిస్తూ ఉంటారు. ఇలా చేయడం మీకు నచ్చకపోతే.. వెంటనే వారికి సున్నితమైన వార్నింగ్ ఇవ్వడం మంచిది. అలా ఇవ్వకపోతే ఎప్పటికీ హేళన చేస్తూ ఉంటారు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.

[

Leave a Comment