అగ్నిపరీక్ష లో మరోసారి దమ్ము చూపించిన శ్రీజ..కానీ జడ్జిలు

Bigg Boss 9 Agnipariksha Sreeja: మరో వారం రోజుల్లో బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది. ఈ సీజన్ లోకి సామాన్యులకు బిగ్ బాస్ 9 లోకి అడుగుపెట్టే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ ‘అగ్ని పరీక్ష'(Agnipareekshaa) షో ద్వారా ఆడియన్స్ ఓటింగ్ తో 5 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. ప్రతీ రోజు అర్థరాత్రి 12 గంటలకు ఈ షో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ షోలో ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ మొత్తాన్ని గమనిస్తే ఆడియన్స్ కి పడాల పవన్ కళ్యాణ్,దమ్ము శ్రీజ, షాకిబ్ మరియు మాస్క్ మ్యాన్ హరీష్ చాలా బాగా నచ్చారు. సోషల్ మీడియా ఓటింగ్స్ వీళ్ళకే అత్యధిక శాతం పడుతున్నాయి. మర్యాద మనీష్ కి చాలా తెలివైన వాడు అనే ముద్ర పడింది, ఆయనకు కూడా ఓటింగ్స్ ఆరంభంలో బాగానే పడేవి కానీ ఇప్పుడు తగ్గిపోయాయి.

Also Read: ఓడిపోయినోడ్ని ‘అగ్నిపరీక్ష’ కి జడ్జిగా పెడతారా..? నవదీప్ పై రెచ్చిపోయిన కౌశల్!

ఇక ఈ షో మొదలు కాకముందు నుండే ఆడియన్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిన ప్రసన్న కుమార్ కి మొదటి రోజు ఓటింగ్ భారీగా ఉండేది. కానీ షో లో ఆయన ఎలాంటి ప్రభావం ఇప్పటి వరకు చూపకపోవడం తో ఆయన ఓటింగ్ బాగా పడిపోయింది. ఇక దమ్ము శ్రీజ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఆడిషన్స్ లో ఈమెని చూసినప్పుడు ఆడియన్స్ లో కలిగిన మొట్టమొదటి ఫీలింగ్, తొందరగా ఈమెని పంపేయండి అని. కానీ అగ్నిపరీక్ష షో మొదలైన దగ్గర నుండి ఇప్పటి వరకు ఈమె ఆడుతున్న గేమ్ ని చూస్తుంటే, ఉన్న ఆ 15 మందిలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే మొట్టమొదటి అర్హత ఈమెకు మాత్రమే ఉందని తెలుస్తుంది. ఈమె ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలదు, ఫిజికల్ టాస్కులు మగవాళ్ళతో సమానంగా ఆడగలడు, వీటితో పాటు బుర్ర పెట్టి ఆడాల్సిన టాస్కుల్లో కూడా ఈమె శభాష్ అనిపించుకుంది.

నిన్నటి ఎపిసోడ్ లో లక్ మరియు తెలివి కి సంబంధించిన టాస్కులు నిర్వహించారు. తెలివికి సంబంధించిన టాస్క్ లో దమ్ము శ్రీజ తన టీం నుండి పాల్గొని అత్యధిక ప్రశ్నలకు సమాధానం చెప్పి టీం ని గెలిపించింది. బెస్ట్ కంటెస్టెంట్ ట్యాగ్ నిన్నటి ఎపిసోడ్ కి కూడా ఈమెనే సొంతం చేసుకొని రెండవ స్టార్ గెలుస్తుందని అనుకున్నారు. కానీ పాపం ఆమెకు లక్ లేదు, నాగ ప్రశాంత్ కి బెస్ట్ కంటెస్టెంట్ ట్యాగ్ వచ్చింది, అదే విధంగా ఆయన టీం లో అసలు ఏ మాత్రం ఆడని ప్రియా కి కూడా ఆడియన్స్ కి ఓటు అప్పీల్ ని చేసుకునే అవకాశం కలిగింది. కానీ అద్భుతంగా టాస్కులు ఆడిన దమ్ము శ్రీజ కి మాత్రం ఏమి దక్కలేదు. ఇదే కాస్త చూసే ప్రేక్షకులకు అన్యాయం అనిపించింది, కానీ ఆమె ఓటింగ్ గ్రాఫ్ ఇంకా పెరిగి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు.

Leave a Comment