Nagarjuna Birthday Special Video: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అక్కినేని నాగేశ్వరరావు నటుడిగా చాలా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు…ఇక తన నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగార్జున…కెరియర్ మొదటి నుంచి ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి ఇమేజ్ను సంపాదించి పెట్టాయి. రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో చేసిన శివ సినిమాతో ఒక్కసారిగా మాస్ హీరోగా మారడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షించాడు…ఇక ఈరోజు నాగార్జున 66వ బర్త్ డే ను జరుపుకుంటున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు నాగార్జున స్టైల్ ని, అతని స్వాగ్ ను తెలిసేలా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అది చూసిన నెటిజన్లందరూ చాలా అద్భుతంగా ఉందని నాగార్జున 66 సంవత్సరాల వయసులో ఉన్నాడంటే ఎవరు నమ్మలేమని కామెంట్లు అయితే చేస్తున్నారు. మరి మొత్తానికైతే నాగార్జున ఇప్పుడున్న యంగ్ హీరోలతో పాటు పోటీపడుతు తన అందాన్ని కాపాడుకుంటూ అంతకు మించిన మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు…ఇక నాగార్జున రీసెంట్ గా చేసిన కూలీ సినిమాలో విలన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఆ సినిమాతో ఎక్కడలేని గుర్తింపు సంపాదించుకున్నాడు.
Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
ముఖ్యంగా తెలుగులో అతని క్యారెక్టర్ కి పెద్దగా ఆదరణ దక్కకపోయినా కూడా తమిళ్ ఇండస్ట్రీ లో మాత్రం ఆయనకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ అయితే దక్కుతోంది… సైమన్ పాత్రలో ఒదిగిపోయి నటించిన రజనీకాంత్ కు పోటీని ఇస్తూ నటించిన తీరు అద్భుతంగా ఉందనే వాళ్ళు తెలియజేస్తూ ఉండడం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా నాగార్జున ఇప్పుడు తన వందో సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. గతంలోనే తన వందో సినిమా చేస్తారంటూ వార్తలు వచ్చినప్పటికి కొంతవరకు గ్యాప్ తీసుకుని కుబేర, కూలీ సినిమాల్లో నటించి తన నటన ప్రతిభను మరోసారి ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం అయితే చేశాడు.
ఇక ఇప్పుడు ఫుల్ ఫుల్డ్జేడ్ గా సినిమా మీద ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే వందో సినిమాను ప్రేక్షకులందరికి నచ్చినట్టుగా తీయగలుగుతారా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే ఈరోజు బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకుంటూ నాగార్జునకి పలువురు సినిమా సెలబ్రెటీలు సైతం విషెస్ ను తెలియజేస్తూ ఉండడం విశేషం…