Yellamma Movie Latest Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి చాలా వరకు తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వేణు ఎల్దండి సైతం ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు చేస్తున్న ఎల్లమ్మ సినిమాకి పలువురు హీరోలను సెలెక్ట్ చేసి వాళ్లతో సినిమా చేస్తున్నామని అనౌన్స్ చేస్తున్నప్పటికి ఎప్పటికప్పుడు హీరోలు ఈ సినిమా నుంచి తప్పకుంటున్నారు. దానికి కారణం ఏంటి అనే విషయం మీద ఎవరికి సరైన క్లారిటీ అయితే రావడం లేదు. మొదట ఈ కథ నాని దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత తేజ సజ్జా ను దగ్గరికి వెళ్ళింది. ఇక తన నుంచి నితిన్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నితిన్ దగ్గర నుంచి శర్వానంద్ దగ్గరికి వెళ్ళింది.
ఇక ఇప్పుడు శర్వానంద్ కూడా కాదు తమిళంలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ధనుష్ తన దైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు… ఇక ఈ సినిమాలో ధనుష్ చేసినట్లయితే సినిమాకు భారీ బజ్ అయితే వస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఈ సినిమాలో ధనుష్ చేస్తే తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఏ సినిమా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇదంతా చూస్తున్నా సినిమా అభిమానులు మాత్రం ధనుష్ ఈ సినిమాలో నటిస్తే అతనికి తెలంగాణ స్లాంగ్ రాదు కదా మరి ఎలా మేనేజ్ చేస్తారు అంటూ కొన్ని వార్తలైతే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం ధనుష్ ఈ సినిమాలో నటిస్తే బాగుంటుంది ప్లాన్ తో ఏముంది వేరే వాళ్ళతో డబ్బింగ్ చేప్పిస్తే అయిపోతుంది అని మరి కొంతమంది చెబుతుండటం విశేషం…
మొత్తానికైతే ధనుష్ కనక ఈ సినిమాలో చేస్తే మాత్రం సినిమాకి భారీ బజ్ అయితే వస్తోంది. మరి ఇప్పటివరకు రోజుకొక హీరో పేరు వినిపిస్తున్న ఈ సినిమాలో ఎవరు ఫైనల్ అవుతారు. ఎవరిచేత ఈ సినిమాలో నటింపజేయాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ఫైనల్ గా హీరో ఎవరు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…