వాల్నట్స్ ఆరోగ్యానికి మంచివని మనకు తెలుసు. కానీ, వాటిని నేరుగా తినడం కంటే నానబెట్టి తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతారు. వాల్‌నట్స్‌ను నానబెట్టడం వల్ల వాటిలో ఉండే పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. ఇది మెదడు, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
వాల్నట్స్ ప్రయోజనాలు
మెదడు ఆరోగ్యం: వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
జీర్ణక్రియ: నానబెట్టిన వాల్‌నట్స్‌లో ఎంజైమ్‌లు చురుగ్గా మారతాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. పోషకాలను శోషించుకోవడంలో సహాయపడతాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది.
గుండె ఆరోగ్యం: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బరువు తగ్గించడం: వాల్‌నట్స్‌లో ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చేస్తాయి. దీనివల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
మధుమేహ నియంత్రణ: వాల్‌నట్స్‌లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది.
మంచి నిద్ర: వాల్‌నట్స్‌లో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
ఎలా తినాలి?
ప్రతి రోజు రాత్రి 2-3 వాల్‌నట్స్‌ను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినండి.
[