Viral Video: ఓసినీ.. ఎంత పనిచేశావే.. క్యాష్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లి చెట్టెక్కిన కోతి.. తర్వాత ఏం జరిగిందో చూడండి! – Telugu News | Viral Video: Monkey Steals Cash Bag, Showers Money Notes from Tree at Tehsil Office in Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి బైక్‌పై డబ్బుల బ్యాగ్ పెట్టుకొని ఉండగా.. దాంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయోమో అనుకొని ఆ బ్యాగ్‌ను లాక్కెల్లింది. ఈ క్రమంలో అందులో ఉన్న డబ్బులను కిందకు పడేసింది. అక్కడే ఉన్న స్థానికులు ఆ డబ్బుల కోసం ఎగబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. దోదాపూర్ గ్రామానికి చెందిన రోహితాష్ చన్రా అనే ప్రైవేట్‌ టీచర్‌ మంగళవారం మధ్యాహ్నం లాయర్‌తో కలిసి బిధున ఎమ్మార్‌వో ఆఫీస్‌ వచ్చారు. వారు రిజిస్ట్రేషన్‌ కోసం పత్రాలు పరిశీలిస్తున్నారు.

అయితే రోహితాష్ తన బైక్‌లో డబ్బుల బ్యాగ్‌ను ఉంచాడు. ఆ బ్యాగ్‌లో రూ.80,000 డబ్బులు ఉన్నాయి. అయితే అక్కడే ఉన్న ఒక కోతి ఆ బ్యాగ్‌ను చూసింది. అందులో తినడానికి ఏమైనా ఉన్నాయేమో అనుకొని.. వెంటనే ఆ బ్యాగ్‌ను ఎత్తుకొని చెట్టుపైకి వెళ్లింది. పైకి చేరిన తర్వాత ఆ బ్యాగ్‌ తెరిచి ఆహారం కోసం వెతికింది. అందులో తినడానికి ఏం లేకపోవడంతో అందులో ఉన్నడబ్బులను కిందకు వెదజల్లింది. దీంతో అక్కడున్న కొందరు స్థానికులు డబ్బుల కోసం ఎగబడ్డారు.

అయితే తన బ్యాగ్‌ను కోతి ఎత్తుకెళ్లడం చూసిన రోహితాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అది పైనుంచి పడేసిన డబ్బులను దక్కించుకునేందుకు అతను కూడా ప్రయత్నించాడు. దీంతో అక్కడున్న వ్యక్తుల నుంచి రూ.52,000 వరకు సేకరించగలిగాడు. కానీ మిగతా 28 వేలను కోల్పోయాడు. అక్కడే ఉన్న కొందరు తతంగాన్నంత వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment