Site icon Desha Disha

Riyan Parag: ఆ జట్టుకు కెప్టెన్‌గా రియాన్ పరాగ్.. ట్రోఫీ నుంచి ఆ ప్లేయర్ ఔట్.. – Telugu News | Riyan Parag to Captain East Zone after Easwaran Pulls Out of Duleep Trophy

Riyan Parag: ఆ జట్టుకు కెప్టెన్‌గా రియాన్ పరాగ్.. ట్రోఫీ నుంచి ఆ ప్లేయర్ ఔట్.. – Telugu News | Riyan Parag to Captain East Zone after Easwaran Pulls Out of Duleep Trophy

బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ప్రారంభమైన దులీప్ ట్రోఫీ టెస్ట్ టోర్నమెంట్‌లో పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట నిర్ణయించిన కెప్టెన్లు అనారోగ్యం, గాయాల కారణంగా దూరంగా ఉండటంతో జట్టు నాయకత్వంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

కెప్టెన్సీలో మార్పులు

ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్‌గా మొదట ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు. అయితే గాయం కారణంగా అతను టోర్నమెంట్ నుండి తప్పుకున్నాడు. అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. కానీ దురదృష్టవశాత్తు ఈశ్వరన్ కూడా జ్వరంతో బాధపడుతుండటంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో యువ ఆటగాడు రియాన్ పరాగ్ ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

గిల్ స్థానంలో..

అదే సమయంలో నార్త్ జోన్ జట్టుకు భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా అతను కూడా టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో అంకిత్ కుమార్ నార్త్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

మ్యాచ్ అప్‌డేట్స్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ర్యాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయంతో నార్త్ జోన్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. పరాగ్ నాయకత్వంలో భారత సీనియర్ ఆటగాళ్లు మొహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్ ఈస్ట్ జోన్ తరపున బరిలోకి దిగడం విశేషం.

నార్త్ జోన్ ప్లేయింగ్ 11: శుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్ (కెప్టెన్), యష్ ధుల్, ఆయుష్ బడోని, కన్హయ్య వాధవన్ (వికెట్ కీపర్), సాహిల్ లోత్రా, నిశాంత్ సింధు, హర్షిత్ రాణా, ఆకిబ్ నబీ దార్, మయాంక్ డాగర్, అర్ష్‌దీప్ సింగ్.

ఈస్ట్ జోన్ ప్లేయింగ్ 11: ఉత్కర్ష్ సింగ్, శరణ్‌దీప్ సింగ్, విరాట్ సింగ్, రియాన్ పరాగ్ (కెప్టెన్), కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), శ్రీదామ్ పాల్, సూరజ్ సింధు జైస్వాల్, ముఖ్తార్ హుస్సేన్, మహ్మద్ షమీ, మనీషి, ముఖేష్ కుమార్.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. 

Exit mobile version