Rain Alert: మరో బాంబ్ పేల్చిన వాతారణ శాఖ.. వచ్చే 7 రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో.. – Telugu News | Telangana, Andhra Pradesh Rain Alert: 7 Day Heavy Rainfall Forecast Latest Weather Report

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరోసారి వర్షసూచన చేసింది. తెలంగాణలో రెండు రోజులపాటు, ఏపీలో వారం రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీన పడినప్పటికీ.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కంటిన్యూ అవుతాయని తెలిపింది. రెండు రాష్ట్రాలకు రాబోయే మూడు రోజులకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీన పడిందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఏపీలోని పలు జిల్లాల్లో మరో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథకుమార్. అల్పపీడనానికి నైరుతి దిశగా ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా.. అల్లూరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో రాబోయే 24గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని.. అందులోనూ.. ఉత్తర తెలంగాణపై అధిక ప్రభావం ఉంటుందన్నారు జగన్నాథకుమార్.

బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీన పడడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్‌. అయితే.. కొన్ని జిల్లాల్లో మాత్రం రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే చాన్స్‌ ఉందని చెప్పారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం ఛత్తీస్‌గఢ్‌ మీదుగా మధ్యప్రదేశ్‌ వైపు పయనించే అవకాశం ఉందన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌, కొమురం భీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక.. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలను భారీ వర్షాలు వరదలతో ముంచెత్తాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అత్యధిక వర్షపాతాలు నమోదు అయ్యాయి. అటు.. ఏపీలోనూ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. తెలంగాణకు రెండు రోజులు, ఏపీకి వారంరోజుల పాటు వాతావరణశాఖతీ వర్షసూచన చేయడం భయపెడుతోంది. అటు.. వాతావరణశాఖ హెచ్చరికలతో ఏపీ,తెలంగాణలోని ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఆయా జిల్లాల్లోని అధికారులను అలర్ట్‌ చేస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment