Rahul Dravid : భారత జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అతను టీమిండియా తరపున అద్భుతమైన షాట్లు ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే, భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇటీవల కోహ్లీ గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కోహ్లీ పొట్టివాడని చెప్పాడు. ఇది విని అభిమానులు ఆశ్చర్యపోయారు.
రాహుల్ ద్రావిడ్ ఏమన్నాడు?
ఆశిష్ కౌషిక్‌తో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. “గవాస్కర్ బ్యాలెన్స్డ్ ఆటగాడు. నేను అతని బ్యాటింగ్‌ను ఎప్పుడూ చూసేవాడిని. నేను అతని కంటే కొంచెం పొడవుగా ఉండటం వల్ల నేను అతన్ని కాపీ చేయలేదు. సచిన్ టెండూల్కర్ కూడా బ్యాలెన్స్డ్ ఆటగాడు. పొట్టిగా ఉండే బ్యాట్స్‌మెన్‌లకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, బ్రయాన్ లారా, రికీ పాంటింగ్ లాంటి చాలామంది గొప్ప బ్యాట్స్‌మెన్‌లు పొట్టిగానే ఉన్నారు. సర్ డాన్ బ్రాడ్‌మాన్ కూడా పొట్టివాడే. విరాట్ కోహ్లీ కూడా పొట్టివాడే. నేను కోహ్లీని పొట్టివాడు అని అంటే అతనికి ఈ మాటలు నచ్చవు” అని ద్రావిడ్ అన్నాడు.
ద్రావిడ్ ఇంకా మాట్లాడుతూ.. “కానీ ఈ రోజుల్లో ఆట చాలా వేగంగా మారిపోయింది, ఆటగాళ్లు నిరంతరం సిక్సులు కొట్టాలి. కెవిన్ పీటర్సన్, కీరన్ పొలార్డ్ లాంటి పొడవాటి ఆటగాళ్లకు ఈ విషయంలో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది” అని తెలిపాడు.
ద్రావిడ్ కోచింగ్‌లో భారత్‌కు వరల్డ్ కప్
రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో భారత జట్టు 2024 ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాను ఓడించి, 2007 తర్వాత టీ20 వరల్డ్ కప్‌ను భారత్ రెండోసారి గెలిచింది. ఈ టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ ఫైనల్‌లో 76 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..