Pawan Kalyan key decision: ‘అల్లూరి సీతారామరాజు’ పేరు.. పవన్ కీలక నిర్ణయం!

Pawan Kalyan key decision: జనసేన(janasena) బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టారు అధినేత పవన్ కళ్యాణ్. ఏడాది పాలన పూర్తి అయిన నేపథ్యంలో ఇకనుంచి పార్టీపై పూర్తి దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగా విశాఖలో ఈనెల 30న జనసేన విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ‘సేనతో సేనాని’ అని పేరు పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. డిప్యూటీ సీఎం పవన్ మూడు రోజులపాటు విశాఖలోనే ఉంటారు. ముఖ్య నాయకులతో సమావేశమై వారికి దిశా నిర్దేశం చేస్తారు.

ఆవిర్భావ సభకు మించి..
జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో( Pithapuram) జరిగింది. జనసేన విజయం సాధించిన తర్వాత నిర్వహించిన ఈ సభ విజయవంతం అయ్యింది. విశాఖ సభలను సైతం విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జనసేన కు చెందిన పదిహేను వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు సేవతో సేనాని అని పేరు పెట్టగా.. ప్రాంగణానికి మాత్రం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు పవన్ కళ్యాణ్. విశాఖ మున్సిపల్ స్టేడియంలో ఈ సభ జరగనుంది. ఐదు ప్రధాన ద్వారాలకు ఉత్తరాంధ్ర మహనీయుల పేర్లు పెట్టారు.

మూడు రోజుల పాటు కార్యక్రమాలు
మూడు రోజులపాటు ఈ సభలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం( Alliance government ) చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. 29న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పదిమంది పార్టీ సభ్యులను ఎంపిక చేస్తారు. వారితో పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై మాట్లాడుతారు. ఆరోజు రాత్రి ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 30న భారీ బహిరంగ సభ ఉంటుంది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ అవుతారు. 29న 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి వచ్చే క్రియాశీలక కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్.

Also Read: అనుకోకుండా వరద.. ప్రకాశం బ్యారేజీకి మొదటి హెచ్చరిక!

జనసేన బలోపేతం.. విశాఖలో( Visakhapatnam) జరిగే పార్టీ విస్తృతస్థాయి సమావేశాలతో జనసేన బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు పార్టీ శ్రేణులు. భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడానికి ఈ విస్తృత స్థాయి సమావేశాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. వాస్తవానికి ఉత్తరాంధ్ర విషయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో ఉంటారు. పార్టీలో ఎలాంటి నిర్ణయానికి రావాలన్నా.. కొత్త కార్యక్రమం రూపొందించాలన్న ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడతారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీకి కీలకంగా భావిస్తున్న విస్తృత స్థాయి సమావేశాలు విశాఖ నుంచి మొదలు పెడుతుండడం విశేషం.

Leave a Comment