
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తాను అంగీకరించిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ఓజీ.. ఒరిజినల్ గాంగ్‌స్టార్. ఓజీ నుంచి వస్తున్న అప్డేట్స్.. అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. తాజాగా రెండో పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్ లోని టాటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి రెండో పాటకు సంబంధించిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ రొమాంటిక్ లుక్ లో కనిపించారు. దీపాల వెలుగులో వారిద్దరూ ఎంతో రొమాంటిక్ గా ఉన్నారు.
అయితే అభిమానుల దృష్టి మొత్తం పవన్ కుడి చేతిపై ఉన్న ఒక టాటూ పై పడింది. జపనీస్ భాషలోని మూడు అక్షరాలతో ఉన్న ఆ టాటూ అర్థం ఏమిటని అందరూ ఆసక్తిగా ఇంటర్‌నెట్ లో సెర్చింగ్ ప్రారంభించారు. అందులో మొదటి అక్షరానికి ప్రామిస్ – వాగ్దానం.. రెండో అక్షరానికి స్ట్రెంత్ – బలం.. మూడో అక్షరానికి ఫైర్ – నిప్పు అని అర్థం వస్తుందని అంటున్నారు. ఈ మూడు పదాలు సినిమాలోని పవన్ పాత్ర స్వభావాన్ని ఆయన లక్ష్యాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గ్లిమ్ప్స్ ఇంకా మొదటి పాటతో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఓజీ పై ఈ టాటూ ఇప్పుడు మరిన్ని ఆసక్తిని పెంచుతుంది.