సాగరతీరం విశాఖలో మకాం వేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మూడురోజుల సమావేశాల్లో భాగంగా గురువారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు పవన్ కల్యాణ్. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు డిప్యూటీ సీఎం. పార్టీలో అంతర్గత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఎమ్మెల్యేలు అండగా ఉండాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తాచాటేలా బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నామని.. అందరూ కష్టపడి పని చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.. కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలంటూ కోరారు.
జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన వారితో శుక్రవారం సమావేశమవుతారు పవన్ కల్యాణ్. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పదిమందిని ఎంపికచేసి వారితో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముచ్చటిస్తారు.
ఈనెల 30న ఇందిరా గాంధీ ప్రియదర్శిని స్టేడియంలో జనసేన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. జనసేన సమావేశాలతో విశాఖలో పండగ వాతావరణం నెలకొంది అంటున్నారు జనసేన వీరమహిళలు..
కాగా.. జనసేన పార్టీ బలోపేతం.. కార్యకర్తల్లో నూతనోత్తాజాన్ని నింపడం.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడమే లక్ష్యంగా సేనతో సేనాని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..