OG Movie Overseas Bookings: ఏదో అనుకుంటే..ఇంకేదో అయ్యింది..’ఓజీ’ ఓవర్సీస్ బుకింగ్స్ ఇలా ఉన్నాయేంటి!

OG Movie Overseas Bookings: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) మూవీ మేనియా అప్పుడే మొదలైంది. ఈ సినిమా విడుదల అవ్వడానికి ఇంకా 28 రోజులు ఉంది. కానీ అప్పుడే ఎక్కడ చూసినా ఓజీ పేరు తప్ప మరొకటి వినిపించడం లేదు. ఇకపోతే రేపు ఈ చిత్రానికి సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. నిన్న వినాయక చవితి కావడం తో దేవుడి ఆశీర్వాదం కోసం అన్నట్టుగా కేవలం రెండు థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. రెస్పాన్స్ మామూలు రేంజ్ లో రాలేదు. 46 షోస్ షెడ్యూల్ చేయగా, వీటి నుండి 3 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 90 వేల డాలర్లు వచ్చినట్టు సమాచారం. ఇది చిన్న విషయం కాదు. పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఈ రేంజ్ గ్రాస్ ని అందుకోవడానికి నాలుగు రోజుల సమయం పట్టింది.

అలాంటిది ఓజీ చిత్రానికి కేవలం 24 గంటల సమయం పట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ చిత్రం పై ఎలాంటి క్రేజ్ ఉంది అనేది. బుకింగ్స్ ప్రారంభించిన ఆరంభం లో లేటెస్ట్ పాన్ ఇండియన్ సినెమాలన్నిటినీ పరిశీలించి చూస్తే, ఓజీ ఆల్ టైం రికార్డు నెలకొల్పింది అనొచ్చు. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి 22 లొకేషన్స్ లో 52 షోస్ ని ఆరంభం లో షెడ్యూల్ చేయగా, దానికి దాదాపుగా 75 వేల డాలర్లు వచ్చాయి. అదే విధంగా పుష్ప 2 చిత్రానికి ఆరంభం లో 65 వేల డాలర్లు రాగా, సలార్ చిత్రానికి 45 డాలర్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత ‘హరి హర వీరమల్లు’, ‘గేమ్ చేంజర్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ‘ఓజీ’ టాప్ 1 స్థానం లో ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే రేంజ్ ర్యాంపేజ్ ని కొనసాగిస్తుందో లేదో చూడాలి.

ఒకవేళ ఇదే రేంజ్ ట్రెండ్ ని కొనసాగిస్తూ ముందుకు పోతే ఈ చిత్రం కచ్చితంగా ప్రీమియర్ షోస్ నుండి 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని నెలకొల్పిన సినిమాగా నిలుస్తుంది. మరి ఈ సినిమాకు నిజంగా అంత రేంజ్ ఉందా లేదా అనేది రేపు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ 2 లోపు ఈ చిత్రానికి హాఫ్ మిలియన్ కి పైగా ప్రీ సేల్స్ పెట్టాలని చూస్తున్నారు ఫ్యాన్స్. ట్రెండ్ సహకరిస్తే ఇంకా ఎక్కువ గ్రాస్ వసూళ్లు కూడా రావొచ్చు. కేవలం నార్త్ అమెరికా లో మాత్రమే కాదు, జర్మనీ లో కూడా ఇదే రేంజ్ ట్రెండ్ కొనసాగుతుంది. యునైటెడ్ కింగ్డమ్ మరియు ఆస్ట్రేలియా కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ సెప్టెంబర్ 8 నుండి మొదలు అవుతాయట.

Leave a Comment