Most Sixes : ఆ విషయంలో రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టడం కష్టమేనా? ధోని కూడా ఆయన తర్వాతే – Telugu News | Rohit Sharma Holds World Record for Most Sixes in International Cricket!

Most Sixes : త్వరలో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌కు ముందు, శ్రీలంక జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. పాకిస్తాన్, యూఏఈ, అఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 ట్రై సిరీస్ జరగనుంది. ఇక, టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఒక నెల విరామం అనంతరం మళ్ళీ మైదానంలోకి అడుగుపెడుతుంది. క్రికెట్‌లో ప్రతిరోజూ ఎన్నో రికార్డులు నమోదవుతాయి.. అలాగే వాటిని బద్దలు కొడుతూ ఉంటారు. ప్రస్తుతం టీ20 క్రికెట్ హవా నడుస్తోంది. ఈ ఫార్మాట్‌లో బులెట్ వేగంతో పరుగులు సాధిస్తారు. అయితే, టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో అత్యధిక సెంచరీల రికార్డు ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. అలాంటి ఒక రికార్డు భారత క్రికెటర్ పేరిట ఉంది.

అంతర్జాతీయ క్రికెట్ (టెస్ట్, వన్డే, టీ20)లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ రికార్డ్ రోహిత్ శర్మ పేరు మీద ఉంది. ఈ జాబితాలో రోహిత్ శర్మతో పాటు మరో ఆరుగురు దిగ్గజాలు ఉన్నారు. ఈ ఏడుగురిలో రోహిత్ శర్మ, క్రిస్ గేల్, షాహిద్ అఫ్రిది, బ్రెండన్ మెక్‌కల్లమ్, మార్టిన్ గుప్టిల్, జోస్ బట్లర్, మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు.

అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 7 ఆటగాళ్లు

1. రోహిత్ శర్మ: రోహిత్ శర్మ టీ20ఐ, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇకపై అతను వన్డేలు మాత్రమే ఆడతాడు. అతను ఇప్పటివరకు 499 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 637 సిక్సర్లు కొట్టాడు.

2. క్రిస్ గేల్: ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ, క్రిస్ గేల్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. గేల్ 483 మ్యాచ్‌లలో 553 సిక్సర్లు కొట్టాడు.

3. షాహిద్ అఫ్రిది: పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది మూడో స్థానంలో ఉన్నాడు. అఫ్రిది 524 మ్యాచ్‌లలో 476 సిక్సర్లు కొట్టాడు.

4. బ్రెండన్ మెక్‌కల్లమ్: న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మెక్‌కల్లమ్ 432 మ్యాచ్‌లలో 398 సిక్సర్లు కొట్టాడు.

5. మార్టిన్ గుప్టిల్: మెక్‌కల్లమ్ తర్వాత ఐదో స్థానంలో మరో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ ఉన్నాడు. గుప్టిల్ 367 మ్యాచ్‌లలో 383 సిక్సర్లు కొట్టాడు.

6. జోస్ బట్లర్: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ ఆరో స్థానంలో ఉన్నాడు. బట్లర్ ఇప్పటివరకు 384 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 369 సిక్సర్లు కొట్టాడు. అతను ఇంకా ఆడుతున్నాడు కాబట్టి, ఈ జాబితాలో ఇంకా పైకి వెళ్లే అవకాశం ఉంది.

7. మహేంద్ర సింగ్ ధోని: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏడో స్థానంలో ఉన్నాడు. ధోని 538 మ్యాచ్‌లలో 359 సిక్సర్లు కొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment