Mirai movie trailer talk: ‘మిరాయ్’ ట్రైలర్ వచ్చేసింది.. తేజ సజ్జ ఈసారి కుంభస్థలం బద్దలు కొట్టేలా ఉన్నాడు!

Mirai movie trailer talk: తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్'(Mirai movie) సెప్టెంబర్ 5 నుండి 12వ తేదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొంత బ్యాలన్స్ ఉండడం తో ఈ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని ఆ చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇది కాసేపు పక్కన పెడితే నేడు కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ లో అభిమానుల సమక్షం లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సినిమా క్వాలిటీ చూస్తుంటే వేరే లెవెల్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. గ్రాఫిక్స్ కి ఎంత ఖర్చు పెట్టారో తెలియదు కానీ, సహజత్వానికి చాలా దగ్గరగా ఉంది.

ప్రేక్షకులు ఈమధ్య కాలం లో ఇలాంటి సినిమాల కోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్లకి కావాల్సిన కంటెంట్ మేకర్స్ అందించగలిగితే ఆకాశమే హద్దు అనే విధంగా వసూళ్లు వస్తున్నాయి. అందుకు ఉదాహరణ తేజ సజ్జ గత చిత్రం ‘హనుమాన్’ ని తీసుకోవచ్చు. ఇకపోతే ఈ ట్రైలర్ ని చూస్తున్నంతసేపు ఒక కొత్త ప్రపంచం లోకి అడుగుపెడుతున్నట్టుగా అనిపించింది. ఈ చిత్రం లో విలన్ గా మంచు మనోజ్(Manchu Manoj) నటించిన సంగతి తెలిసిందే. ఆయన క్యారక్టర్ ని కూడా ట్రైలర్ లో చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ‘నా గతం..నాకు శత్రువు..నా ప్రస్తుతం ఊహాతీతం’ అంటూ మనోజ్ చెప్పే డైలాగ్ ని చూస్తుంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ చాలా పవర్ ఫుల్ గా ఉండేట్టుగా అనిపిస్తుంది. గతం లో ఆయనకు జరిగిన అన్యాయం కారణంగానే విలన్ గా మారి ఉంటాడని మనం ఊహించుకోవచ్చు. ఈ ప్రపంచం లో ఉన్న 9 గ్రంధాలు మనోజ్ చేతుల్లోకి వెళ్తే విద్వంసం సృష్టిస్తాడని, దానిని అడ్డుకోవడానికే హీరో తేజ సజ్జ క్యారక్టర్ ఉంటుందని ట్రైలర్ ని చూస్తే తెలుస్తుంది.

కానీ విలన్ క్యారక్టర్ మనోజ్ ని ఎదురుకోవడం అంత తేలికైన విషయం కాదు. అతన్ని అడ్డుకోవాలంటే శ్రీరాముడు నడిచిన త్రేతాయుగం లో పుట్టిన ఒక ఆయుధం వల్లే సాధ్యం అవుతుందని ఈ ట్రైలర్ లో చూపించారు. ఆ ఆయుధం కోసం హీరో చేసే ప్రయాణం, మధ్యలో ఆయనకు ఎదురైనా అనుభూతులు ప్రేక్షకులకు థియేటర్ లో ఒక సరికొత్త అనుభవాన్ని ఇస్తుందని అనుకోవచ్చు. మంచు కొండల్లో ఒక పెద్ద పక్షి తో హీరో చేసే పోరాటం చూస్తుంటే ఇది పిల్లలకు బాగా నచ్చే సినిమా అని అనిపిస్తుంది. ఇక ట్రైలర్ చివర్లో మనకు ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ శ్రీరాముడి క్యారక్టర్ ని చూపించడం కూడా మరో హైలైట్ గా అనిపించింది. ఓవరాల్ గా ట్రైలర్ అదిరిపోయింది, సంక్షోభం లో ఉన్న టాలీవుడ్ ని ఈ సినిమా రక్షించగలదు అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో కూడా వచ్చింది.

Leave a Comment