Guntur Arundalpet: వర్షం పడింది.. కండోమ్ ల కథ బయటపడింది

Guntur Arundalpet: దొంగ గుట్టు పాదముద్ర బయటపెట్టిందనే సామెతను మీరు ఎప్పుడైనా చదివారా.. పోనీ నిజ జీవితంలో అలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా.. దీనికి మీ సమాధానం ఎలా ఉంటుందో తెలియదు గానీ.. ఈ కథనం చెబితే నీకు పై సామెత నిజమైన అనుభవమే ఎదురవుతుంది. ఎందుకంటే జరిగిన సంఘటన అటువంటిది కాబట్టి.

Also Read: తారుమారైన బిగ్ బాస్ 9 ‘అగ్నిపరీక్ష’ ఓటింగ్..ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ అవుట్?

నేటి కాలంలో చాటుమాటు సంబంధాలను చాలామంది ఇష్టపడుతున్నారు. ఇలా రాయడానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న వ్యవహారాలు అలా ఉన్నాయి కాబట్టి.. ఇటువంటి చాటు వ్యవహారాలు గతంలో నిర్మానుష్య ప్రాంతంలో జరిగేవి. అని ఇప్పుడు హోటల్స్, లాడ్జిలలో చోటు చేసుకుంటున్నయ్. ఇటువంటి వారికి ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉంటున్నాయి. ఇది అనైతికమని.. దారుణమని చాలామంది అనుకుంటూ ఉండవచ్చు. అందులో మీరు కూడా ఉండవచ్చు. అయితే మీలా మిగతావారు ఉండాలని లేదు కదా.. అందువల్లే దొరికిన అవకాశాన్ని ఇలా వినియోగించుకుంటున్నారు.

చాటుమాటు సంబంధాలతో..

చాటుమాటు సంబంధాలలో తొడుగులు అనేవి అత్యవసరం. ఎందుకంటే అవి లేకపోతే రకరకాల సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.. హెచ్ఐవి ఎలాగూ ఉండనే ఉంది. అందువల్ల చాలామంది ఇటువంటి అనైతికమైన లైంగిక కార్యకలాపాలలో పాల్పడేందుకు తొడుగులు వాడుతుంటారు. ఆక్రతువు పూర్తి అయిన తర్వాత దానిని పడేస్తుంటారు. అయితే ఆ సమయంలో ఉన్న ఆత్రుత.. ఆ పని పూర్తయిన తర్వాత ఉండదు. ఎందుకంటే అప్పటికే ఉపయోగించిన తొడుగును ఎక్కడో ఒకచోట పడేస్తూ ఉంటారు. అలా పడేసే విధానంలో పొరపాటు లాడ్జి నిర్వాహకుల బాగోతాన్ని బయటపెట్టింది.

విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల .

ప్రస్తుతం ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు బీభత్సంగా కురుస్తున్న ఏరియాలో గుంటూరు కూడా ఉంది. గుంటూరు నగరంలోని అరండల్ పేటలో కురుస్తున్న వర్షం వల్ల కండోమ్ లు బయటికి వస్తున్నాయి. ఒకటి, రెండు కాదు.. ఒక ప్రవాహం లాగా దూసుకు వస్తున్నాయి. ఇది అక్కడి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోంది. వర్షంలో చెత్తాచెదారం రావడం సర్వసాధారణం. ఇంకా ఏవైనా వ్యర్థ పదార్థాలు రావడం కూడా సర్వసాధారణమే. కానీ ఇలా కండోమ్ లు రావడాన్ని అక్కడి ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే అరండల్ పేటలో ఒక లాడ్జిలో అనైతికమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని.. అక్కడికి వచ్చే వారంతా ఆ పని పూర్తి చేసుకొని కండోమ్ లను పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేస్తున్నారని.. అందువల్లే వర్షం కురవడం.. వరద నీటి ప్రవాహానికి కండోమ్ లు ఇలా రోడ్లమీదకి వచ్చాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ లాడ్జి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటే ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కావని వారు అంటున్నారు.

Leave a Comment