Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల తాజా అప్‌డేట్ – Telugu News | Gold, Silver Rates Today 28 August 2025 in Telangana Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 28, గురువారం బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ మార్పులు, డాలర్ విలువలో ఊగిసలాట కారణంగా ఈ పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, రాష్ట్ర స్థాయిలో మాత్రం గణనీయమైన పెరుగుదల కనిపించింది.

హైదరాబాద్ మార్కెట్ రేట్లు: 24 క్యారెట్: రూ. 10,245/గ్రాము (+1), 22 క్యారెట్: రూ. 9,391/గ్రాము (+1)

బ్యాంక్ బజార్ రిపోర్ట్ ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర స్థాయి రేట్లు ఇలా ఉన్నాయి: 24 క్యారెట్: రూ. 9,860/గ్రాము (+37), 22 క్యారెట్: రూ. 9,390/గ్రాము (+35)

బ్యాంక్ బజార్ రిపోర్ట్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి రేట్లు ఇలా ఉన్నాయి: 24 క్యారెట్: రూ. 9,860/గ్రాము (+37), 22 క్యారెట్: రూ. 9,390/గ్రాము (+35)

హైదరాబాద్‌లో ధరలు స్వల్పంగా మాత్రమే పెరిగాయి. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సగటు రేట్లలో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకుంది. నిపుణుల అంచనా ప్రకారం.. బంగారం ధరలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ బంగారం డిమాండ్, క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్ విలువల ఆధారంగా మారవచ్చు.

ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. స్థానిక జ్యువెలర్స్ వద్ద ధరలు కొద్దిగా వేరుగా ఉండవచ్చు. GST, మేకింగ్ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బంగారం కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ రేట్లు తప్పక చెక్ చేసుకోవాలి.

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ 1,30,000 కాగా, విజయవాడలో అది రూ 1,29,900గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Leave a Comment