వినాయక చవతి పండుగ వేళ బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మహిళలకు షాక్ ఇస్తూ గడిచిన ఐదు రోజుల్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఏకంగా రూ. 1600 వరకు పెరగగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1500 మేరకు పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితలు, భారత్‌పై ట్రంప్ డబుల్ టారిఫ్స్ లాంటివి గోల్డ్ రేట్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయ్. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,02,220గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,710గా కొనసాగుతోంది. ఇక చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,02,070గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,560గా ఉంది. ఇటు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. అటు వెండి ధరలు మాత్రం నేలచూపులు చూస్తున్నాయ్. గడిచిన రెండు రోజుల్లో కేజీ వెండి ధర రూ. 1100 మేరకు తగ్గింది. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 1,19,900గా ఉండగా.. హైదరాబాద్, చెన్నై, కేరళ, విజయవాడ నగరాల్లో కిలో వెండి రూ. 1,29,900గా కొనసాగుతోంది. కాగా, పైన పేర్కొన్న ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ గోల్డ్ రేట్స్ కోసం 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.