Floods in AP: అనుకోకుండా వరద.. ప్రకాశం బ్యారేజీకి మొదటి హెచ్చరిక!

Floods in AP: అనుకోకుండా వరద.. ప్రకాశం బ్యారేజీకి మొదటి హెచ్చరిక!

Floods in AP: ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా చాలా ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లో వానలు కారణంగా.. నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీకి( Prakasam Barrage ) ఒకేసారి వరద నీరు చొచ్చుకొస్తోంది. దీంతో అక్కడ రికార్డు స్థాయిలో కనిపిస్తోంది బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం. ఈ నెలలో ఇలా వరదలు రావడం ఇది మూడోసారి. గతంలో కూడా భారీ స్థాయిలో వరదలు రావడంతో అధికారులు నీటిని కిందకు విడిచిపెట్టారు. ఇప్పుడు కూడా పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తివేసారు. దీంతో కృష్ణా నదిలో నీటి ప్రవాహం భారీ స్థాయిలో ఉంది. అందుకే నది పరివాహక ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.

పోటెత్తిన వరద..
ప్రకాశం బ్యారేజీకి ఒకేసారి వరద( flood ) పోటెత్తింది. ప్రస్తుతం 3 లక్షల మూడు వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతోంది. దీంతో అధికారులు 69 గేట్లను ఎత్తి.. రెండు లక్షల 97 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఈరోజు నీటి ప్రవాహ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే చాలా గ్రామాలు మునిగిపోతాయన్న భయం వెంటాడుతోంది. మరోవైపు లంక గ్రామాలతో పాటు నది పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళద్దని ఆదేశాలు ఇచ్చారు.

Also Read: ఏపీలో ‘జిందాల్’ పెట్టుబడులు.. జగన్ ప్రచారం ఉత్తదే!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షాలు..
ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా( Krishna district) జిల్లాలో వర్ష తీవ్రత అధికంగా ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. విజయవాడ నగరంలో వర్షం నీరు రోడ్లమీద నిలిచిపోయింది. రోడ్లు కాలువల్లా మారిపోయాయి. మురుగునీటి కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మైలవరం, గన్నవరం, పామర్రు, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, పెనమలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఏలూరు జిల్లాల్లో అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గోదావరిలో వరద పెరుగుతున్న దృష్ట్యా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు విపత్తుల నిర్వహణ సంస్థ వర్ష ప్రభావిత ప్రాంతలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తోంది.

Leave a Comment