Bullet Train Mumbai Ahmedabad: ముంబై, అహ్మదాబాద్ మధ్య “బుల్లెట్ ట్రైన్” ప్రయాణం సాధ్యమవుతుందా?

Bullet Train Mumbai Ahmedabad: చైనా బుల్లెట్ రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల అవసరానికి తగ్గట్టుగా రైళ్లను ఆధునికీకరిస్తున్నది. జపాన్ కూడా అంతే.. వేగవంతమైన బుల్లెట్టు రైళ్లను నడుపుతూ సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నది. వాస్తవానికి జపాన్ దేశంతో పోల్చి చూస్తే.. మనదేశంలో రైళ్లల్లో వెళ్లే ప్రయాణికులు ఎక్కువ. అంతేకాదు చైనా కంటే కూడా మనదేశంలో రైళ్లలో వెళ్లే ప్రయాణికులు ఎక్కువగానే ఉంటారు. అయితే ఇంతమందికి సౌకర్యాలు కల్పించడంలో మన దేశ రైల్వే వ్యవస్థ విఫలమవుతూనే ఉంది. మారుతున్న కాలంలో ప్రయాణికుల అభిరుచి కూడా మారింది. ఆర్థిక స్థిరత్వం పెరుగుతున్న నేపథ్యంలో గమ్యస్థానాలకు అత్యంత వేగంగా వెళ్లాలని ప్రయాణికులు భావిస్తూ ఉంటారు. సమయాన్ని ఆదా చేసుకోవాలని అనుకుంటారు. అటువంటి వారికోసం భారతీయ రైల్వే వ్యవస్థ బుల్లెట్ రైళ్లను తెరపైకి తీసుకు వచ్చింది.

Also Read: వర్షం పడింది.. కండోమ్ ల కథ బయటపడింది

బ్రిటిష్ కాలం నాటిది

మనదేశంలో రైలు పట్టాల నిర్మాణం బ్రిటిష్ కాలం నాటిది.. మన దేశంలో కొత్త రైల్వే ట్రాక్ లను నిర్మిస్తున్నారు. ప్రతి ఏడాది నూతన రైల్వే ట్రాక్ లను రైల్వే శాఖ నిర్మిస్తూనే ఉంటుంది. బుల్లెట్ రైళ్లకు ఈ రైల్వే ట్రాక్ లు సరిపోవు. వాటికి అధునాతన రైల్వే ట్రాక్ లు అవసరమవుతాయి. మనదేశంలో ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సంవత్సరాల క్రితం రూపొందించిన ఈ ప్రణాళిక ఇప్పుడు వేగవంతమైన అడుగులు వేస్తోంది.

సిద్ధమవుతోంది

దేశంలో తొలి బుల్లెట్ రైలు మార్గం సిద్ధమవుతోంది. ముంబై , అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు త్వరలోనే పరుగులు పెట్టబోతోంది. 317 కిలోమీటర్ల పొడవుతో ప్రత్యేకమైన రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ రైల్వే ట్రాక్ మొత్తం వయాడక్ట్ విధానంలో ఉంటుంది. అంటే మొత్తం పిల్లర్ల మీదనే రైల్వే ట్రాక్ ఉంటుంది.. 198 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నేల మీద నిర్మించారు. గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, బరూచ్, సూరత్, బిలిమోరా, వాపి ప్రాంతాలలో స్ట్రక్చరల్ వర్క్ పూర్తయింది. మహారాష్ట్రలోని బాయ్ సార్, విరార్, తానే, ముంబైలో పనులు మొదలయ్యాయి. దీనికి సంబంధించి వీడియోలను nhsrcl ట్విట్టర్ ఎక్స్ లో పంచుకుంది.. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని అందులో పేర్కొంది. అయితే ఎప్పటినుంచి ఈ బుల్లెట్ రైలు పరుగులు పెడుతుందో మాత్రం nhsrcl చెప్పలేదు.

Leave a Comment