Site icon Desha Disha

Asia Cup 2025 : పాకిస్థాన్‎కు అంత సీన్ లేదు.. ఫైనల్‎కు వచ్చే ఛాన్సే లేదు.. సొంత ప్లేయరే షాకింగ్ కామెంట్స్ – Telugu News | Pakistan Will Not Reach Asia Cup Final Ex Pakistani Cricketers Bold Prediction!

Asia Cup 2025 : పాకిస్థాన్‎కు అంత సీన్ లేదు.. ఫైనల్‎కు వచ్చే ఛాన్సే లేదు.. సొంత ప్లేయరే షాకింగ్ కామెంట్స్ – Telugu News | Pakistan Will Not Reach Asia Cup Final Ex Pakistani Cricketers Bold Prediction!

Asia Cup 2025 : ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. వీటిని 2 గ్రూపులుగా (ప్రతి గ్రూప్‌లో 4 జట్లు) విభజించారు. టోర్నమెంట్‌ ప్రారంభం కావడానికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో, క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు టోర్నమెంట్‌పై తమ అంచనాలు వేస్తున్నారు. అయితే, ఆసియా కప్ ఫైనల్‌లో ఏ రెండు జట్లు తలపడతాయి? అనే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ చేసిన అంచనా అందరినీ ఆశ్చర్యపరిచింది. అతని ప్రకారం.. ఈసారి పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకోదు. మరి, ఫైనల్‌లో భారత్‌తో తలపడే జట్టు ఏది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైనల్‌లో భారత్, ఆఫ్ఘనిస్తాన్?

ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లు తప్పకుండా సూపర్-4కి చేరుకుంటాయని అందరూ భావిస్తున్నారు. గ్రూప్ దశలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఒకవేళ రెండూ సూపర్-4కు చేరితే, సెప్టెంబర్ 21న మరోసారి తలపడే అవకాశం ఉంది. కానీ, దానిష్ కనేరియా మాత్రం పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకోదని అంచనా వేశాడు.

తన యూట్యూబ్ ఛానల్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల గురించి చర్చిస్తూ కనేరియా ఈ సంచలన ప్రకటన చేశాడు. అతని ప్రకారం, ఈసారి ఆసియా కప్ ఫైనల్ భారత్, అఫ్ఘనిస్తాన్ మధ్య జరగవచ్చు. పాకిస్తాన్ జట్టుపై కేవలం కనేరియా మాత్రమే కాదు.. బాసిత్ అలీ లాంటి మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు చేశారు.

దానిష్ కనేరియా మాట్లాడుతూ.. “భారత జట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈసారి కూడా టైటిల్ గెలవడానికి బలమైన పోటీదారు. అయితే, ఈసారి ఆఫ్ఘనిస్తాన్ జట్టు గట్టి పోటీ ఇస్తుంది. నా అంచనా ప్రకారం, ఆసియా కప్ ఫైనల్ భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగవచ్చు. పాకిస్తాన్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్ ఒక పెద్ద సవాలును విసురుతుంది” అని అన్నాడు.

పాకిస్తాన్‌ను భారత్ సులభంగా ఓడిస్తుంది

దానిష్ కనేరియా సెప్టెంబర్ 14న జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి కూడా అంచనా వేశాడు. భారత జట్టును మెచ్చుకుంటూ, “ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉంటుంది, కానీ భారత జట్టు పాకిస్తాన్‌ను చాలా సులభంగా ఓడిస్తుందని నేను నమ్ముతున్నాను. భారత జట్టులో చాలా బలంగా ఉంది. కాబట్టి టైటిల్ గెలవడానికి కూడా భారత్ బలమైన పోటీదారు” అని అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Exit mobile version