ఆసియా కప్‌లో భారత్ పాకిస్థాన్‌తో ఆడాలా? వద్దా అనే ప్రశ్నకు టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌తో భారత్ ఆడటం సరైనదేనా అనే దానిపై పెద్ద చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం ఆమోదిస్తే భారత్-పాకిస్తాన్ జరగడంలో ఎలాంటి తప్పులేదని షమీ అభిప్రాయపడ్డాడు. అలాగే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల తర్వాత తాను ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై కూడా షమీ స్పందించాడు.
షమీ మాట్లాడుతూ.. “నేను వివాదాలకు దూరంగా ఉంటాను. పాక్‌తో మ్యాచ్ గురించి ప్రభుత్వం, బీసీసీఐ నిర్ణయిస్తాయి. మేం వారి నిర్ణయాన్ని అనుసరిస్తాం” అని షమీ చెప్పాడు. ఇతర జట్లతో పోలిస్తే పాకిస్తాన్‌తో ఆడటం భిన్నంగా ఉందని షమీ పేర్కొన్నాడు. “అభిమానుల క్రేజ్ కారణంగా పాకిస్తాన్‌తో ఆడటం భిన్నంగా ఉంటుంది” అని అతను చెప్పాడు. ఇంటర్నెట్లో ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. తాను ముస్లిం అయినందున కొంతమంది తనను లక్ష్యంగా చేసుకుంటారని, కానీ అతను దాని గురించి పట్టించుకోనని చెప్పాడు.
“నేను ముస్లింని కాబట్టి కొందరు నన్ను లక్ష్యంగా చేసుకుంటారు, ముఖ్యంగా పాకిస్తాన్ మ్యాచ్‌ల తర్వాత నన్ను ట్రోల్ చేస్తారు. నాకు అది పట్టదు. నేను యంత్రాన్ని కాదు, నాకు మంచి, చెడు రోజులు ఉంటాయి. నేను నా దేశం తరపున ఆడుతున్నప్పుడు, నేను సోషల్ మీడియా కంటే వికెట్లు, విజయాలపైనే దృష్టి పెడతాను. ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేయదు ఎందుకంటే నేను దానిని కంట్రోల్ చేయలేను. అందుకే దాన్ని అసలు పట్టించుకోను” అని షమీ సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి తెలిపాడు. కాగా ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో షమీకి చోటు దక్కలేదు. ఐపీఎల్ 2025లో షమీ ఫేలవ ప్రదర్శన కనబర్చడంతో సెలెక్టర్లు అతన్ని టీ20లకు పరిగణంలోకి తీసుకోలేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి