6 Wickets in 6 Balls: W, W, W, W, W, W… 6 బంతుల్లో 6 వికెట్లు.. బ్యాట్స్‌మెన్‌లకు షాక్.. స్టేడియం మొత్తం షేక్ – Telugu News | W, W, W, W, W, W… 6 Wickets in 6 Balls This Indian Bowler Creates History

6 Wickets in 6 Balls: క్రికెట్‌లో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. ఓడిపోతున్న మ్యాచ్‌ను కూడా కొన్నిసార్లు ఒక జట్టు గెలుచుకుంటుంది. ఒకే ఓవర్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టడం కూడా చూశాం. అయితే, ఒకే ఓవర్‌లో ఆరు బంతులకు ఆరు వికెట్లు తీసిన బౌలర్ ఎవరో తెలుసా ? అసలు ఇలా జరుగుతుందా అన్న సందేహం వ్యక్తం అవుతుంది కదా.. కానీ, ఇది నిజంగా జరిగింది. ఒక భారతీయ సంతతికి చెందిన బౌలర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఆ బౌలర్ పేరు హర్షిత్ సేథ్, అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తరఫున ఆడుతాడు.

8 వికెట్లు  తీసిన హర్షిత్ సేథ్

భారతీయ మూలాలున్న ఈ అద్భుతమైన బౌలర్ హర్షిత్ సేథ్ యూఏఈలోని అజ్మాన్‌లో జరిగిన కార్వాన్ అండర్-19 గ్లోబల్ టీ20 లీగ్‌‎లో 6 బంతుల్లో వరుసగా 6 వికెట్లు తీసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సంఘటన 2021లో జరిగింది. ఈ లీగ్‌లో యూఏఈకి చెందిన డీసీసీ స్టార్లెట్స్, పాకిస్తాన్‌కు చెందిన హైదరాబాద్ హాక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన డీసీసీ స్టార్లెట్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.

ఒకే బంతిలో 6 వికెట్లు

హైదరాబాద్ హాక్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, 12 పరుగుల వద్ద ఒక్క వికెట్ కూడా పడలేదు. కానీ, స్పిన్ బౌలర్ హర్షిత్ సేథ్ బౌలింగ్‌కు రాగానే, అతను మొత్తం మ్యాచ్‌నే మార్చివేశాడు. ఆ మ్యాచ్‌లో హర్షిత్ మొత్తం 8 వికెట్లు తీశాడు.

హర్షిత్ తన మొదటి ఓవర్‌లో చివరి నాలుగు బంతులకు నాలుగు వికెట్లు తీశాడు. ఆ తర్వాత, తన రెండో ఓవర్‌లో మొదటి రెండు బంతులకు రెండు వికెట్లు తీశాడు. ఈ విధంగా, హర్షిత్ సేథ్ 6 బంతుల్లో వరుసగా 6 వికెట్లు తీసి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. హర్షిత్ ఈ అద్భుతమైన ఫీట్‌కు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా షేర్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment