2 వారాల్లో 500 కోట్లు..కానీ 'కూలీ' బ్రేక్ ఈవెన్ అసాధ్యమే!

2 వారాల్లో 500 కోట్లు..కానీ 'కూలీ' బ్రేక్ ఈవెన్ అసాధ్యమే!

Coolie 2 Weeks Collections: సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకొని బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. నిన్న గాక మొన్న విడుదల అయ్యినట్టు అనిపిస్తున్న ఈ చిత్రం అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఈ రెండు వారాల్లో 500 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇంతటి భారీ వసూళ్లు వస్తే ఇతర స్టార్ హీరోల సినిమాలు సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంటాయి. కానీ ఈ సినిమా మాత్రం ఫ్లాప్ గానే మిగిలేలా కనిపిస్తుంది. నిన్న వినాయక చవితి అవ్వడం తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త గ్రోత్ ని అయితే చూపించుకుంది కానీ, ఆశించిన స్థాయిలో మాత్రం లేదు.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం. ఈ వీకెండ్ ఎంత వసూళ్లు వస్తే అంత జమ చేసుకోవాలి బయ్యర్స్. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కేవలం నాలుగు కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వస్తే చాలు. కానీ తమిళనాడు లో మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది ఈ చిత్రం. అక్కడ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 230 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. కానీ ఇప్పటి వరకు 142 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాలి. అది అసాధ్యం. తమిళనాడు నుండి ఫుల్ రన్ లో మరో 20 కోట్ల రూపాయిల గ్రాస్ కి మించి రాదనీ అంటున్నారు.

ప్రాంతాల వారీగా ఈ సినిమాకి రెండు వారాల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి దాదాపుగా 68 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తమిళనాడు నుండి 142 కోట్ల రూపాయిలు, నార్త్ ఇండియా నుండి 43 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ నుండి 177 కోట్ల రూపాయిలు, కర్ణాటక నుండి 43 కోట్ల రూపాయిలు, కేరళ నుండి 25 కోట్ల రూపాయిలు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 497 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. నార్త్ అమెరికా లో కూడా ఈ చిత్రానికి నష్టాలు మిగిలే లేవు. ఫుల్ రన్ లో ఈ చిత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రావాలి. కానీ అది కష్టం లాగానే అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ చిత్రం కమర్షియల్ గా నిరాశపరిచినట్టే.

Leave a Comment