హైపర్ ఆది.. ఎంత పనిచేస్తివి – OkTelugu

Sridevi Drama Company Hyper Aadi: తెలుగు సినిమా ఇండస్ట్రిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే టీవీ షోల ద్వారా కూడా చాలామంది పాపులారిటీని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ ఉన్నా కూడా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న హైపర్ ఆది మాత్రం తనదైన రీతిలో పంచులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి ఈవెంట్లో తనే అందర్నీ డామినేట్ చేస్తూ పంచులు వేస్తూ ఉంటాడు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన స్పెషల్ గా కనిపిస్తూ ప్రతి ఒక్కరిని ఆటపట్టిస్తూ ప్రేక్షకుల్లో నవ్వులు పంచే ప్రయత్నం అయితే చేస్తుంటాడు.

Also Read: బీహార్ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ కు కేజ్రివాల్ షాక్.. ఈ ప్రశ్నలకు రాహుల్ సమాధానం చెబుతారా?

ఇక దాంతోపాటు గానే రేసింగ్ గా రిలీజ్ అయిన ఈ షో ప్రోమో ని కనక మనం చూసినట్టయితే అందులో సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లు టీవీ రంగంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న వారందరూ కలిసి ఒక ఈవెంట్ అయితే చేశారు.

మరి ఈవెంట్లో భాగంగానే ‘బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్న’ అనే సాంగ్ చేసిన అక్షిత్ మార్వెల్ ని ఉద్దేశించి ఈయన చేసిన ఈయన చేసిన ఆ సాంగ్ మాలాంటి వాళ్లకు ఎంతో మందికి సంబరాన్ని ఇచ్చింది.అంటూ దాన్ని డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు… ఇక ఇది చూసిన చాలా మంది బాగుండాలమ్మ సాంగ్ అనేది ఒక ఎమోషన్ తో కూడిన సాంగ్ దాని మీద కూడా కామెడీ చేయడం ఎందుకు అంటూ సోషల్ మీడియాలో హైపర్ ఆది మీద చాలా మంది విరుచుకుపడుతున్నారు.

మరి ఏది ఏమైనా కూడా హైపర్ ఆది ప్రతిదాన్ని కామెడీ చేయాలనుకోవడం సరైనది కాదు కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. వాటి మీద పంచులు వేయడం అన్నది అంత సరైనదైతే కాదు. మరి ఈ ఒక్కదాన్ని తెలుసుకొని హైపర్ ఆది ఉంటే బాగుంటుంది. ఎందుకంటే బాగుండాలమ్మ అనే సాంగ్ ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూర్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఇప్పటికీ ఆ సాంగ్ చాలామంది ప్లే చేసుకుని వింటూ ఉంటారు. అలాంటి ఒక ఎమోషనల్ సాంగ్ మీద కామెడీ చేయడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి…

 

Leave a Comment