సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పరుచూరి రాజేంద్ర

రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా చుండూరు సుబ్బారావు…

విశాలాంధ్ర నందిగామ:-పార్టీ బలోపేతం కొరకు పనిచేసే ప్రతి ఒక్కరికి సరైన సమయంలో సరైన గుర్తింపు వస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన పరుచూరి రాజేంద్ర బాబు, కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన చుండూరు సుబ్బారావు అన్నారు ఇటీవల ఒంగోలులో జరిగిన సిపిఐ రాష్ట్ర 28వ మహాసభల్లో ఈ ఎన్నిక నిర్వహించినట్లు ఎన్నిక ద్వారా తమకు సముచిత స్థానం అందించిన పార్టీ అధిష్టానానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు దివంగత నేత సూర్యదేవర నాగేశ్వరరావు ప్రోత్సాహంతో విద్యార్థి నాయకునిగా ఏఐఎస్ఎఫ్ లో జాయిన్ అయి నియోజకవర్గ కార్యదర్శిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పలు పదవుల్లో విద్యార్థి యువజన సమైక్యలపై గుంతెత్తి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించి పనిచేసిన పరుచూరి రాజేంద్ర బాబు నేడు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పార్టీ నియమించిందని తెలిపారు అలాగే సూర్యదేవర నాగేశ్వరరావుకు అనుచరుడుగా రైతు సంఘం లో చేరి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శిగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ రైతుల సమస్యలపై వేదాద్రి పోలంపల్లి మునేరు ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయాలని పలు ఉద్యమాలను నిర్వహించిన చుండూరు సుబ్బారావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నిక చేయటం నందిగామ ప్రాంతానికి సిపిఐ రాష్ట్ర నాయకత్వం సముచిత స్థానం కల్పించిందని ఆనందం వ్యక్తం చేశారు ఈ పదవుల అలంకరణ తమపై మరింత బాధ్యతను పెంచిందని పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేస్తామని వారు తెలిపారు….

Leave a Comment