శివ తర్వాత దుర్మార్గాలు.. పర్సనల్ లైఫ్ లోకి దాడి చేశాడు వర్మ…

Tanikella Bharani Comments On Ram Gopal Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం… అప్పట్లో ఆయనకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. శివ సినిమాతో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఆయన ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలతో తన మార్కును చూపిస్తూ ప్రేక్షకులందరిని మెప్పిస్తూ వచ్చాడు. మరి అలాంటి సమయంలోనే ఆ సినిమా మాటలు రచయితగా పనిచేసిన తనికెళ్ల భరణితో చాలామంది రామ్ గోపాల్ వర్మ గురించి అడిగి తెలుసుకునే వాళ్ళట…ఆయన ఏ టైం కి పడుకుంటాడు, ఏం తింటాడు, ఏం చదువుతాడు అంటూ అతని గురించి చాలా మంది అడిగేవారట. దానికి ఆయన చాలా వరకు విసిగిపోయేవాడట. మరి మొత్తానికైతే శివ ఇచ్చిన సక్సెస్ తో తనికెళ్ల భరణి దాదాపు 12 సినిమాలోకి డైలాగ్ రైటర్ గా పని చేశాడట. అయినప్పటికి అందులో ఏ సినిమా కూడా ఆడలేదట. ఇక తన దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్లందరు శివ సినిమా రేంజ్ లో డైలాగులు ఉండాలి అని చెబుతూ ఉండేవారట. దానికి ఆయన నవ్వుకునేవాడట. ఎందుకు అంటే శివ సినిమా రేంజ్ లో డైలాగ్ ఉండాలంటే శివ సినిమా రేంజ్ లో సీన్లు రాయాలి. వాటిని స్క్రీన్ మీద తెరకెక్కించగలిగేంత సత్తా ఉన్న దర్శకుడు కావాలి. అవన్నీ లేకుండా శివ సినిమా రేంజ్ లో రాయాలి అంటే ఎలా కుదురుతోందని అనుకునేవాడట. ఇక మరి కొంతమంది అయితే మరి దారుణం చేసేవారట…కొంతమంది చిన్న రైటర్లతో రాయించుకుని ఆ తర్వాత తన దగ్గరికి వచ్చి వాటిని కొంచెం సెట్ చేసి పెట్టమనేవారట.

Also Read: ‘బిగ్ బాస్ 9’ హౌస్ సెట్ ఎంత అందంగా ఉందో చూసారా..? 2 హౌస్లు అదిరిపోయాయి!

మొత్తానికైతే తనికెళ్ల భరణి శివ సక్సెస్ తో ఎన్ని సినిమాలను కమిటై ఆ మూవీస్ ను కంప్లీట్ చేశాడో అంతకు మించిన ఇబ్బందికి కూడా గురయ్యాడట. మరి ఏది ఏమైనా కూడా శివ సినిమా చేయాలి అంటే అది అందరికీ సాధ్యపడదు… విజయవాడ లోని సిద్ధార్థ కాలేజీలో రాంగోపాల్ వర్మ ఎలాంటి సన్నివేశాలనైతే చూశాడో వాటిని మెటీరియలైజ్ చేసి సినిమాగా రాశాడు.

అదే కాబట్టే శివ సినిమా అయింది. అది అందరివల్ల కాదు కదా అంటూ తను శివ మూవీ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. మరి ఏది ఏమైనా కూడా తనికెళ్ల భరణి ప్రస్తుతం ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ లో ముందుకు సాగిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…

1989 లో వచ్చిన శివ అంతకుముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న సినిమాల మూస ధోరణిని బ్రేక్ చేసింది. మరి అలాంటి రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చేయడాన్ని తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి మరోసారి ఆయన శివ లాంటి సినిమా చేస్తే చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక తొందర్లోనే మరో మంచి సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Leave a Comment