Site icon Desha Disha

రిటైర్మెంట్ ఆలోచన లేదు:మహ్మద్ షమి

రిటైర్మెంట్ ఆలోచన లేదు:మహ్మద్ షమి

– Advertisement –

క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనే ఆలోచన తనకు లేదని టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి స్పష్టం చేశాడు. ఎవరో చెప్పారని తాను ఆటకు వీడ్కోలు పలకనని, ఒక వేళ తనలో చేవ తగ్గిందని భావిస్తేనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నాడు. మరికొంత కాలం పాటు తాను అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతానని, ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని తెలిపాడు. కొంత మంది పనిగట్టుకుని తనపై లేనిపోని విమర్శలకు దిగుతున్నారన్నాడు. ఆటలో కొనసాగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఫిట్‌నెస్, గాయాల సమస్య లేదని పేర్కొన్నాడు. తన రిటైర్మెంట్‌పై వస్తున్న కథనాలను కొట్టి పడేశాడు. ఎవరి చేతుల్లోనూ వీడ్కోలు నిర్ణయం లేదన్నాడు. ఆటపై విసుగుఉ వచ్చే వరకూ తాను క్రికెట్‌లో కొనసాగుతానని తేల్చి చెప్పాడు. తాను క్రికెట్‌లో కొనసాగితే కొంత మందికి వచ్చే ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. ఇలాంటి విమర్శలను తాను పట్టించుకోనని, ఫిట్‌నెస్‌తో ఉన్నంత కాలం క్రికెట్‌లో కొనసాగుతానని షమీ పేర్కొన్నాడు.

– Advertisement –

Exit mobile version