
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ కోర్టు మెట్లెక్కింది. దేశంలోని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ అయిన A23, గురువారం (ఆగస్టు 28) కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్-మనీ ఆధారిత గేమ్‌లపై నిషేధాన్ని సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్టంపై సంతకం చేసిన తర్వాత ఈ చట్టానికి వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసిన మొదటి పిటిషన్ ఇది. ఈ చట్టం ఏర్పడినప్పటి నుండి, అనేక ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల పోటీలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ భవిష్యత్తు కూడా అనిశ్చితంగా మారింది.
పార్లమెంటు ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు, 2025 ను ఆమోదించినప్పుడు రియల్-మనీ ఆన్‌లైన్ గేమింగ్ వ్యాపారం ఎదురుదెబ్బ తగిలింది. ఈ బిల్లు కింద, అన్ని రకాల డబ్బు ఆధారిత ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించారు. మరోవైపు, ఇ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లను ప్రోత్సహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం పొందిన తర్వాత, ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఇటువంటి యాప్‌ల ద్వారా పెరుగుతున్న మాదకద్రవ్య వ్యసనం, మనీలాండరింగ్, ఆర్థిక మోసాల కేసులను అరికట్టడం దీని ముఖ్య ఉద్దేశ్యం. పార్లమెంటు బిల్లును ఆమోదించిన తర్వాత, Dream11, My11Circle, WinZO, Zupee, Nazara Technologies-మద్దతు గల PokerBaazi వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు తమ రియల్ మనీ గేమింగ్ ఆఫర్‌లను నిలిపివేసాయి.
కర్ణాటక హైకోర్టులో A 23 ఏం చెప్పింది..?
రాయిటర్స్ కథనం ప్రకారం, A23 అనేది రమ్మీ, పోకర్ వంటి ఆటలను ఆన్‌లైన్‌లో అందించే గేమింగ్ ప్లాట్‌ఫామ్. కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, A23, “ఈ చట్టం నైపుణ్యాల ఆధారంగా ఆన్‌లైన్ ఆటలను ఆడే చట్టబద్ధమైన వ్యాపారాన్ని నేర వర్గంలోకి తీసుకువస్తుంది. దీని కారణంగా, అనేక ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు రాత్రిపూట మూసివేయాల్సి రావచ్చు” అని పేర్కొంది. A23 తన పిటిషన్‌లో రాష్ట్రం యజమానిగా మారే మనస్తత్వం ఫలితంగా కొత్త చట్టం వచ్చిందని పేర్కొంది. ఈ చట్టం రమ్మీ, పోకర్ వంటి నైపుణ్య ఆటలకు వర్తింపజేశారు, దీనిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసును ఆగస్టు 30కి వాయిదా వేసింది. అయితే, ఈ విషయంపై ఐటీ మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు.
ఇదిలావుంటే,దేశంలో ఆన్‌లైన్ గేమ్స్ వల్ల యువత తీవ్రంగా నష్టపోతోంది. ఎంతోమంది యువకులు ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్‌లో డబ్బులు నష్టపోయి.. అప్పుల్లో కూరుకుపోయి చివరకు ప్రాణాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి ఎన్నో ఘటనలు కూడా చూశాం. అంతేకాదు పోలీసులు ఈ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను సైతం విచారణ జరిపారు. అంటే ఈ గేమింగ్ యాప్‌ల ప్రభావం ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త గేమింగ్ యాక్ట్‌ను తీసుకొస్తోంది. రియల్-మనీ గేమ్‌లను నిషేధించడం.. ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించడానికి దోహదపడనుంది ఈ చట్టం. అదే సమయంలో e-స్పోర్ట్స్, సోషల్ ఆన్‌లైన్ గేమింగ్‌లోనూ ఆర్థిక వాటా లేకుండా చూసుకుంటుంది. డబ్బులతో కూడిన క్రికెట్ బెట్టింగ్ లాంటి స్కిల్ గేమ్స్‌తోపాటు.. పోకర్, రమ్మీ లాంటి చాన్స్ తీసుకునే ఆన్‌లైన్ ఆటలను ఎవరైనా ప్రమోట్ చేసినా… ఆఫర్ చేసినా.. అందులో పెట్టుబడులు పెట్టినా ఇకపై జైలుకు వెళ్లక తప్పదు. అలాంటి ఆన్‌లైన్ ఆటల్లో అసలు ఆర్ధిక లావాదేవీలు జరగకుండా బ్యాంకులు, పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ నుంచి ప్రాసెసింగ్‌ను నిషేధిస్తారు. దీనివల్ల అసలు పేమెంట్స్ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఈ నిబంధనలను పాటించకుండా ఎవరైనా అతిక్రమిస్తే 3 నుంచి 5ఏళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానాలు ఉంటాయి. ప్రమోషన్ చేసే వారికి 2 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..