బాబోయ్‌.. అగ్రరాజ్యం అమెరికాను హడలెత్తిస్తున్న ఈగ.. షాకింగ్ న్యూస్ తెలిస్తే.. – Telugu News | New World Screwworm (NWS) Myiasis: Flesh Eating Disease in America

మానవ శరీరంలో మాంసాన్ని తినేసే ఓ కొత్తరకం వ్యాధి అమెరికాను వణికిస్తోంది. అరుదైన మాంసాహార పరాన్నజీవి న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ అమెరికాలో బయటపడింది. ఈ కేసును అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం నివేదించింది. ఎల్ సాల్వడార్ నుండి తిరిగి వచ్చిన తర్వాత మేరీల్యాండ్‌లోని ఒక వ్యక్తికి ఇది సోకింది. ఆ వ్యక్తికి చికిత్స అందించారు. అతను పూర్తిగా కోలుకున్నాడు.. వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు దీని వ్యాప్తిని అరికట్టాయి.

మానవ శరీరంలో మాంసాన్ని తినేసే ఓ కొత్తరకం వ్యాధి అమెరికాను వణికిస్తోంది. ఈ వ్యాధిని న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ (NWS) మియాసిస్ అని పిలుస్తున్నారు. ఒక జాతికి చెందిన ఈగ లార్వా మనిషి శరీరంలోకి గాయాలైన చోటు నుంచి లోపలికి చొచ్చుకెళ్లి మాంసాన్ని తినేస్తుంది. దీంతో నొప్పి కలిగి ప్రాణాపాయం సంభవిస్తుంది. మేరీలాండ్‌లో ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడ్డారు. అయితే ఈ వ్యాధి వల్ల మనుషులకు ముప్పు లేదని వైద్యులు చెబుతున్నారు.

ఎల్‌సాల్వెడార్‌ దేశం నుంచి వ్యక్తికి వ్యాధి సోకినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్, ప్రివెన్షన్‌(సీడీసీ) సహకారంతో తొలి కేసును నిర్ధారించినట్లు యూఎస్‌ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హెల్త్, హ్యూమన్‌ సర్విసెస్‌(హెచ్‌హెచ్‌ఎస్‌) తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ (NWS) మియాసిస్ అనేది సాధారణంగా పాడి పశువులు, ఇతర జంతువుల్లో కనిపిస్తుంది. దక్షిణ అమెరికాతోపాటు కరీబియన్‌ దీవుల్లో దీని ఉనికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఇటీవల సెంట్రల్‌ అమెరికా, మెక్సికోతోపాటు అమెరికాకు సైతం విస్తరించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ వ్యాధి బారిన పడివాళ్లలో ప్రధానంగా శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నవారికి ఎన్‌డబ్ల్యూఎస్‌ మియాసిస్‌ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీని ప్రభావానికి గురైన పశువులకు, ప్రాంతాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

[

Leave a Comment