Pawan Kalyan OG: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెంటల్ బేసిస్ మీద థియేటర్స్ ని నడపలేక ఉన్నాము, మాకు కమీషన్ కావాలి అంటూ ఎన్నో ఏళ్ళ నుండి ఎగ్జిబిటర్స్ పోరాటం చేస్తూ ఉన్నారు. దానికి తోడు విడుదలయ్యే సినిమాలు ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. దీంతో థియేటర్స్ లో జనాలు లేక, ఖాళీగా ఉంచుకోవాల్సి వస్తుంది. బంగారం లాంటి స్పేస్ అలా ఖాళీగా ఉంచడం ఇష్టం లేక, అనేకమంది ఓనర్స్ సింగిల్ థియేటర్స్ ని శాశ్వతంగా మూసేసి, వాటిని పడగొట్టి, వాటి స్థానం లో కళ్యాణ మండపాలు కట్టడం, లేదా కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ లు వంటివి కట్టడం చేస్తున్నారు. ఈ ఏడాది ఒక భారీ హిట్ తగలకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేక చోట్ల మూతపడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: హైపర్ ఆది.. ఎంత పనిచేస్తివి…
గత ఏడాది కూడా ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు ఎన్టీఆర్(Junior NTR) ‘దేవర'(Devara Movie), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘పుష్ప 2′(Pushpa 2 Movie) చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్స్ గా నిల్చి సింగిల్ స్క్రీన్స్ ని బ్రతికించాయి. అనేక మాస్ సెంటర్స్ లో మూతపడిన సింగిల్ స్క్రీన్స్ కూడా ఈ రెండు చిత్రాల కారణంగా తెరుచుకున్నాయి. అదే విధంగా ఈ ఏడాది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం కూడా సింగిల్ స్క్రీన్స్ కాపాడుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు ఎగ్జిబిటర్స్. ఈ చిత్రానికి కావాల్సినంత భారీ హైప్ ఉంది. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అనే ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. పైగా దసరా సీజన్ కావడం తో టాక్ తో సంబంధం లేకుండా కనీసం పది రోజులు రోజులైనా అద్భుతమైన వసూళ్లను రాబడుతుందని, ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే నెల మొత్తం మంచి వసూళ్లను రాబడుతుందని, టాలీవుడ్ మళ్లీ గాడిలో పడుతుందని అంటున్నారు.
ఈమధ్య విడుదలైన సినిమాలన్నీ ఘోరమైన డిజాస్టర్స్ అవ్వడం తో బయ్యర్స్ దగ్గర డబ్బుల రొటేషన్ పూర్తిగా ఆగిపోయింది. నిర్మాతలు రిటర్న్ GST మరియు అడ్వాన్స్ లు ఇవ్వకుండా హోల్డ్ లో పెడుతున్నారు. ఇవే బయ్యర్స్ కి మెంటలెక్కించే అంశాలు. వీటి అన్నిటి నుండి బయటపడాలంటే ఓజీ పెద్ద హిట్ అవ్వడం అనివార్యం అని అంటున్నారు. ఇకపోతే రీసెంట్ గానే ఈ సినిమా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అక్కడ ఈ చిత్రానికి అద్భుతమైన ప్రారంభం దొరికింది. అతి తక్కువ షోస్ తోనే ఈ సినిమా లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అక్కడి ట్రెండ్ అద్భుతంగా ఉంది కాబట్టి, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అద్భుతమైన ట్రెండ్ ఉంటుందని ఆశిస్తున్నారు.