డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు కీలక బౌలర్‌గా ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ కప్పు కొట్టడంలో కూడా తన వంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీకి తొలి కప్పు అందించాడు. అలాంటి బౌలర్‌ను లోకల్ కుర్రాళ్లు, ఓ లోకల్ టోర్నీలో చితక్కొట్టారు.
యూపీ టీ20 లీగ్‌లో 20వ మ్యాచ్‌లో లక్నో ఫాల్కన్స్, మీరట్ మావెరిక్స్ తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన రింకు సింగ్ నేతృత్వంలోని మీరట్ మావెరిక్స్ 233 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే లక్నో ఫాల్కన్స్ 93 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పేలవమైన బౌలింగ్ జట్టు ఈ అవమానకరమైన ఓటమికి ప్రధాన కారణం. ముఖ్యంగా జట్టు కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్‌లోని 19వ ఓవర్ చాలా పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసి 49 పరుగులు ఇచ్చి ఒకే ఒక వికెట్ తీశాడు. భువీ వేసిన మొదటి 3 ఓవర్లలో పెద్దగా పరుగులు ఇవ్వలేదు. కానీ తన చివరి ఓవర్‌లో భువీ ఏకంగా 29 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్‌లో మావెరిక్స్ జట్టుకు చెందిన రితురాజ్ శర్మ నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. భువీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ మొదటి బంతికి రితురాజ్ శర్మ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ వైడ్ బాల్ వేశాడు. ఆ తర్వాత రితురాజ్ శర్మ వరుసగా 4 ఫోర్లు బాదాడు. చివరి బంతికి 6 సిక్స్ కొట్టడంతో భువనేశ్వర్ ఓవర్ చాలా కాస్ట్లీగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎప్పుడూ పొదుపుగా బౌలింగ్ వేసే భువీ.. ఇలా లోకల్ టోర్నీలో కుర్రాళ్ల చేతుల్లో అన్ని పరుగులు ఇవ్వడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి