‘కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా కొరత’.. RS ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

‘కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా కొరత’.. RS ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

దిశ, బెజ్జూర్: ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ బీఆర్ఎస్ అని, కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సలుగు పల్లి నుంచి బెజ్జూర్ వరకు 7 కిలోమీటర్ల మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బెజ్జూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నారని, కెసిఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ పాలన గడపగడపకు తీసుకెళ్లాలని సూచించారు. గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో రైతులకు యూరియా కొరత లేదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాలనలో యూరియా కోసం రైతులు పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఉందన్నారు. సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు రోడ్ల గురించి పట్టించుకోవడం లేదన్నారు. సిర్పూర్ నియోజకవర్గం లో రైతుల అధికార పార్టీ నాయకులు, పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు.ఈ కార్యక్రమానికి సిరిపూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండూ గురి శ్యామ్ రావు, మాజీ ఎంపీపీ బస్సర్కర్ విశ్వనాథ్, సింగిల్ విండో చైర్మన్ హర్షద్ హుస్సేన్ , బీఆర్ఎస్ నాయకులు కొంగ సత్యనారాయణ, సలీం, నవీన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బూస సారయ్య, కౌటాల , చింతలమాన పల్లి, దహేగాం, కాగజ్నగర్, పెంచికలపేట మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

Leave a Comment