ఓ కూతురు, ఒక చెల్లి, ఒక స్నేహితురాలు.. హీరోలను

Sreeleela Social Service: జీ తెలుగు లో ప్రసారమయ్యే జగపతి బాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే షోకు వచ్చిన శ్రీలీల ఇచ్చిన ఇంటర్వ్యూను చూసిన వారు ఒక్కరికే కాక, అందరికీ ఒక కొత్త కోణంలో ఆమె పరిచయమైందని చెప్పాలి. తెరపై గ్లామరస్ హీరోయిన్‌గా కనిపించే శ్రీలీల, తెర వెనుక మాత్రం ఒక సాధారణ యువతి, ఒక కూతురు, ఒక చెల్లి, ఒక స్నేహితురాలు అనే కోణాల్లో మనకు కనబడింది.

Also Read: ప్రళయ భీకరం.. కామారెడ్డి ఎలా మునిగిందో చూడండి

ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరువని తీరు, తల్లి చాటు బిడ్డగా ఉండడంలో గర్వపడే మనసు, కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇచ్చే విలువలు, తెలుగు భాషపై ఉన్న మక్కువ.. ఇవన్నీ కలిపి ఆమెను ఒక సాధారణ హీరోయిన్ గా కాకుండా, ప్రతి ఇంటిలోనూ ఉండే మన చెల్లెల్లుగా అనిపించాయి.

సినిమా కెరీర్‌లో బిజీగా ఉన్నప్పటికీ కష్టపడటాన్ని ఎప్పుడూ వదలని తత్వం, సామాజిక సేవపై చూపుతున్న ఆసక్తి, సాదాసీదా మాటల్లోనే మనసును తాకే ఆత్మీయత.. ఇవన్నీ శ్రీలీల వ్యక్తిత్వంలో సహజంగా కలిసిపోయాయి. ఇంటర్వ్యూలో ఎక్కడా కృత్రిమత్వం కనిపించకపోవడం ఆమె నిజమైన అందం.

హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, మంచి మనసున్న యువతిగా కూడా అభిమానుల హృదయాలను గెలుచుకుంటూ ముందుకు వెళ్తున్న శ్రీలీల, రాబోయే రోజుల్లో తెలుగు సినీ పరిశ్రమకు ఒక గర్వకారణమని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరు శ్రీలీల. పెళ్లి సందడి చిత్రం తో మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రీలీల, ఆ తర్వాత ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. కానీ ఈ రెండు సినిమా మధ్యలో,ఆ రెండు సినిమా తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. అయినప్పటికీ ఆమెకు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మన టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ గానే కొనసాగుతుంది. ఇకపోతే రీసెంట్ గా ఈమె జీ తెలుగు లో ప్రసారమయ్యే జగపతి బాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షో కి ముఖ్య అతిథిగా వచ్చింది. ఈ టాక్ షోలో ఆమె మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.

sreeleela-jagapathibabu.jpg

ఈ షో ద్వారా నే శ్రీలీల గొప్పతనం అందరికీ తెలిసొచ్చింది. ఆమె ముఖం మాత్రమే కాదు, మనసు కూడా అందమే అని ఈ ఇంటర్వ్యూ ని చూసిన ప్రతీ ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాదు ఆ షో కి హోస్ట్ గా వ్యహరిస్తున్న జగపతి బాబు అయితే శ్రీలీల చేసిన మంచి పనులను చూసి పైకి లేచి ఆమెకు సెల్యూట్ చేసాడు. ఆ తర్వాత దగ్గరకు తీసుకొని ఆశీర్వదించాడు. ఎంతో బోల్డ్ గా కనిపించే జగపతి బాబు మనసుని కూడా కరిగిపోయింది అంటే శ్రీలీల మంచితనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అనాధ పిల్లలను చేరదీసి పెంచడం, అంగవైకల్యం ఉన్న పిల్లలను దత్తత తీసుకోవడం, అనాధాశ్రమాలకు వెళ్లి పిల్లలతో గడిపి వాళ్లకు కావాల్సినవన్నీ ఇవ్వడం వంటివి ఒకటా రెండా ఎన్నో చేసింది శ్రీలీల. వయస్సు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే.

కానీ ఆమె ఇవన్నీ 20 ఏళ్ళ వయస్సులోనే చేయడం మనమంతా సోషల్ మీడియా ద్వారా చూసాము. కానీ ఆమె చిన్నతనం నుండే ఇలాంటివి చేస్తూ వచ్చిందట. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడమే కాకుండా, ఈమె కొన్ని క్యాంప్స్ లో ఇచ్చే ప్రసంగాలు జీవితం మీద ఆశ కోల్పోయిన వారికి కూడా కొత్త ఆశ చిగురించేలా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంగవైకల్యం ఉన్న కొంతమంది పిల్లల దగ్గరకి వెళ్ళడానికి కూడా ఇష్టపడని తల్లితండ్రులు ఉన్న ఈ కాలం లో, అసలు ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కూడా దత్తత తీసుకొని పెంచుతుంది అంటే ఆమె మనసు ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు. సినిమాలు చేశామా, రెమ్యూనరేషన్ తీసుకున్నామా, వెళ్లిపోయామా అన్నట్టు ఉండే ఎంతో మంది స్టార్ హీరోలు శ్రీలీల ని ఆదర్శంగా తీసుకోవాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు

ఆమెను చూసినప్పుడు ఒక హీరోయిన్ కాకుండా, మన కూతురు, మన చెల్లి, మన స్నేహితురాలు కనిపించడం… అదే శ్రీలీల ప్రత్యేకత. జీ5 లో ట్రెండింగ్ లో ఉన్న శ్రీలీల ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ఎపిసోడ్ ని వెంటనే చూసేయండి.

Leave a Comment