OG Links Jawan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఓజీ'(They Call Him OG) చిత్రం సరిగ్గా 28 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ కాసేపటి క్రితమే మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ఈ చిత్రం ఆల్ టైం రికార్డు ని నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ చిత్రం నుండి విడుదల అవుతున్న ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ నెల ప్రారంభం లో విడుదల చేసిన ‘ఫైర్ స్ట్రోమ్’ లిరికల్ వీడియో సాంగ్ సెన్సేషనల్ హిట్ అవ్వగా, నిన్న విడుదల చేసిన ‘సువ్వి సువ్వి’ పాట మరో చార్ట్ బస్టర్ గా నిల్చింది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు విడుదల చేయబోయే యాక్షన్ టీజర్ కూడా బాగుంటే ఈ సినిమా మీద హైప్ ఇంకా రెట్టింపు అవ్వొచ్చు.
Also Read: హైపర్ ఆది.. ఎంత పనిచేస్తివి…
ఇదంతా కాసేపు పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన సంఘటన తెలిసిందే. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందట. ఆ రేంజ్ లో ఆ సన్నివేశం వచ్చిందని అంటున్నారు. థమన్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ సన్నివేశానికి అదరగొట్టేసాడట. ఈ విషయం తెలిసినప్పటి నుండి ఫ్యాన్స్ ఆ సన్నివేశం ఎలా ఉంటుంది అని ఊహాగానాలతో నిండిన పోస్టులను తమ ట్విట్టర్ ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఇది ఒక బైక్ చేసింగ్ సన్నివేశం అవ్వడం తో, షారుఖ్ ఖాన్(Sharukh Khan) ‘జవాన్'(Jawan Movie) చిత్రం క్లైమాక్స్ ఫైట్ సన్నివేశం తో పోలుస్తూ ట్వీట్లు వేస్తున్నారు. తన కొడుకు ప్రమాదం లో చిక్కుకున్నప్పుడు పెద్ద షారుఖ్ ఖాన్ బైక్ మీద స్టైల్ గా వస్తూ, ఛేజింగ్ చేస్తూ బీభత్సమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది.
ఓజీ మూవీ ఇంటర్వెల్ సన్నివేశం కూడా అలా ఉంటుందేమో అని ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చూడని విధంగా ఆ యాక్షన్ సన్నివేశం ఉండబోతుంది అని తెలిసింది కాబట్టి, మనం ఇతర సినిమాలతో పోల్చి చూసి అలా ఉండబోతుందా? ఇలా ఉండబోతుందా? అని అంచనాలు వేయడం కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియా లో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ సినిమా ఇతర విశేషాల విషయానికి వస్తే సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు. సెప్టెంబర్ 2 న ఆయనకు సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.