Pawan Kalyan AM Ratnam: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ఈ సినిమా షూటింగ్ ఎన్ని ఇబ్బందులను ఎదురుకొని జరిగిందో మనమంతా చూసాము. సుమారుగా ఆరేళ్ళ నుండి సెట్స్ మీద ఉన్న ఈ సినిమా, ఒక్క ఈ ఏడాది లోనే నాలుగు సార్లు వాయిదా పడడం తో మామూలు ఆడియన్స్ లో ఈ సినిమా పై నమ్మకం పోయింది. కేవలం అభిమానుల సహకారం తో ఓపెనింగ్స్ ని తెచ్చుకున్న ఈ సినిమా, డిజాస్టర్ టాక్ కారణంగా ఫుల్ రన్ పై ఘోరమైన ప్రభావం పడింది. ఫలితంగా 75 కోట్ల రూపాయిల షేర్ క్లోజింగ్ తోనే ఈ చిత్రం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిర్మాత AM రత్నం(AM Ratnam) కి భారీ నష్టాలు వచ్చాయి, ఇక భవిష్యత్తులో ఆయన సినిమాలు చేయడం కష్టమే అని అంతా అనుకున్నారు.
Also Read: ‘సుందరకాండ’ మొదటి రోజు వసూళ్లు..కనీసం ప్రింట్ ఖర్చులు కూడా రాలేదుగా!
కానీ ఆయనకీ ఎలాంటి నష్టం రాలేదని, ఈ చిత్రం డైరెక్టర్, రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ బిజినెస్ తో బ్రేక్ ఈవెన్ అయిపోయామని, మాకు ఎలాంటి నష్టం రాలేదని చెప్పుకొచ్చాడు. ‘హరి హర వీరమల్లు’ సీక్వెల్ చేస్తామో లేదో ఇప్పుడే చెప్పలేము కానీ, AM రత్నం కాంబినేషన్ లో మరో సినిమా కచ్చితంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో ఉంటుంది అనే సంకేతం ఇచ్చాడు. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కూడా AM రత్నం పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈసారి ఒక మంచి టాప్ డైరెక్టర్ తో ఒక కమర్షియల్ సినిమా చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడట. మరి ఎవరు ఆ టాప్ డైరెక్టర్?, ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది అనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.
అయితే ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో నిర్మించానని విడుదలకు ముందు AM రత్నం అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. కానీ సినిమా చూసిన తర్వాత అంత బడ్జెట్ కచ్చితంగా అయ్యి ఉండదని స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చూపించిన గ్రాఫిక్స్ కి 200 కోట్ల బడ్జెట్ అంటే చిన్న పిల్లవాడు కూడా నవ్వుతాడు. సినిమా మొత్తానికి బడ్జెట్ 60 నుండి 70 కోట్ల రూపాయిల వరకు అయ్యి ఉంటాడని, పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కూడా ఈ సినిమాకు తీసుకోలేదు కాబట్టి AM రత్నం కి నిజంగానే ఆశించిన స్థాయిలో నష్టాలు వచ్చి ఉండవని విశ్లేషకులు అంటున్నారు.