ఈ వీడియోను రజత్ అనే వ్యక్తి షేర్ చేశారు. ఈ వీడియోలో పప్పులు, నమ్కీన్, బిస్కెట్లు , వివిధ మసాలా దినుసులు, సాస్‌ల ప్యాకెట్లను చూపించాడు. భారతీయులు రోజూ వాడే ఈ పదార్థాల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయని అతడు చెప్పుకొచ్చాడు. డల్లాస్‌లో భారతీయుల జనాభా ఎక్కువ గనుక.. ఈ స్టోర్‌లో ఎప్పుడూ ఈ వస్తువులు అందుబాటులో ఉంచుతారని రజత్ చెప్పుకొచ్చాడు. పప్పులు, నమ్కీన్, బిస్కెట్ల ధరలు సుమారుగ 4 నుంచి 4.5 డాలర్ల రేంజ్లో ఉన్నాయని అతడు పేర్కొన్నాడు. అయితే.. ఈ వీడియో చూసిన యూజర్లు వస్తువుల ధరలు చూసి నోరెళ్లబెట్టారు. ఇండియాలో వాటి ధరలతో అక్కడి ధరలను పోల్చుకుని.. నోరెళ్ల బెడుతున్నారు. ఓ యూజరైతే ‘హైడ్ అండ్ సీక్ బిస్కెట్లు 4 డాలర్లా? అంటే రూ.320. అది ఇండియాలో రూ.20 లకే వస్తుంది’ అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు అర కిలో పప్పు దాదాపు 400 రూపాయలా? ఇక.. మీ జీతం.. ఉప్పూ పప్పులకే సరిపోతుందేమో? అని కొందరు.. అమెరికాలో జీవితం చాలా ఖరీదు బాస్.. అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. రజత్ తన వీడియోలో కేవలం భారతీయ ఉత్పత్తుల ధరలు చెబుతూనే.. వాల్ మార్ట్ స్టోర్‌లో.. భారతీయ ఉత్పత్తులు ఎక్కడ ఉంటాయి? వాటని ఏ ఆర్డర్ లో పెడతారో కూడా చూపించాడు. ఈ వీడియోవైరల్ అయిన తర్వాత, సోషల్ మీడియాలో ప్రజల మిశ్రమంగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇస్రో ఎయిర్‌డ్రాప్ టెస్ట్ సక్సెస్ వ్యోమగాముల సేఫ్ ల్యాండింగ్‌కు మార్గం
వీడియో కోసం వెళితే.. ప్రాణాలే పోయాయి
ప్రేమకథకు గుర్తుగా.. రాళ్ల యుద్ధం.. ఈ జాతర ప్రత్యేకత అదే
OG: టాటూ కారణంగా.. బయటపడ్డ OG కథ
శ్రీదేవి ఆస్తి కోసం చెన్నై హై కోర్టు మెట్లెక్కిన భర్త బోనీ కపూర్