
దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వినాయక చవితిరోజు పసిడి ప్రియులకు బంగారం ధరలు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.93,550 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.350 పెరిగి రూ.93,900గా ఉంది. అలాగే నిన్న రూ.1,02,060 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.380 పెరిగి నేడు రూ.1,02,440గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,30,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.93,550
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,02,440
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.93,550
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,02,440