Sundarakanda Twitter Review: ‘సుందరకాండ’ ట్విట్టర్ రివ్యూ…

Sundarakanda Twitter Review: నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సుందరకాండ’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ రివ్యూలను కనుక మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇస్తుంటే మరి కొంతమంది మాత్రం డివైడ్ టాక్ చెబుతున్నారు…

కథ విషయానికి వస్తే సిద్దార్థ్ (నారా రోహిత్) 30 సంవత్సరాలు నిండిన కూడా ఇంకా పెళ్లి చేసుకోడు. తనకు నచ్చిన 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెతుకుతుంటాడు. ఆయనకి ఆ అమ్మాయి సోకిందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే… మరి ఇలాంటి ఒక సెన్సిబుల్ కథను దర్శకుడు చాలా బాగా డీల్ చేశాడని కొంతమంది చెబుతున్నారు. ఇలాంటి సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేయడం కొంతవరకు కష్టం అనే చెప్పాలి. కత్తి మీద మీద సాము లాంటి అంశాలను తీసుకొని ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాని చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక దర్శకుడు సైతం ఎక్కడా కూడా డివియెట్ అవ్వకుండా సినిమాని సాధ్యమైనంత వరకు ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేశారని చాలామంది చెబుతూ ఉండటం విశేషం…ఇక ట్విట్టర్ లో ఈ సినిమాకి కొంతమంది నుంచి పాజిటివ్ రివ్యూ రావడం అనేది చాలా మంచి విషయం…కానీ నారా రోహిత్ మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తాడు. అనడానికి ఈ సినిమా కూడా ఒక ఉదాహరణ అని చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా నారా రోహిత్ లాంటి నటుడు చాలా సంవత్సరాల తర్వాత మరోసారి కంబ్యాక్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అంటూ ట్విట్టర్ మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు…

ఇక ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా మీద డివైడ్ టాక్ అయితే వ్యక్తం చేస్తున్నారు…ఆ గతంలో నారా రోహిత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా చూడలేదని చెప్పడంతో వాళ్లు కొంతవరకు హర్ట్ అయ్యారు. మరి అందువల్లే నారా రోహిత్ ఈ సినిమా మీద వాళ్ళు కొంతవరకు నెగిటివిటిని స్ప్రెడ్ చేస్తున్నారనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది.

ఒక ఏది ఏమైనా కూడా ఈ సినిమా నారా రోహిత్ అభిమానులను ఆనందపరుస్తుంది. ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమాని చూడాలనుకునే వారు ఈ సినిమాని చూడొచ్చు… చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ అయితే వచ్చింది. ఇక ఈ వీకెండ్ లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ చాలా మంది చెబుతుండటం విశేషం…

Leave a Comment