Schools Holiday: తెలంగాణ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో కొన్ని జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, ఇతర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగ తీవ్ర నష్టం వాటిల్లింది. వాహనాలు సైతం వదరల్లో కొట్టుకుపోయాయి. ఎంతో మంది వరదల్లో చిక్కుకుపోయారు. రెస్య్కూటీమ్ స్పందించి వారిని కాపాడారు.
ఇది కూడా చదవండి: Indian Passport Colours: భారతదేశంలో ఈ 4 రంగులలో జారీ చేసే పాస్‌పోర్ట్‌ల అర్థం ఏమిటి?
రామాయంపేటలో సుమారు 300 మంది విద్యార్థులు వరదల్లో చిక్కుకుపోవడంతో రెస్య్కూటీమ్ కాపాడింది. కామారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షాలకు చాలా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పండగలాంటి వార్త తెలిపారు అధికారులు. ఈ జిల్లాల్లో రేపు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే గణేష్ చతుర్థి సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించి విషయంతెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: Indian Passport Colours: భారతదేశంలో ఈ 4 రంగులలో జారీ చేసే పాస్‌పోర్ట్‌ల అర్థం ఏమిటి?
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన రెస్య్కూటీమ్‌లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అతి భారీ వర్షాలు ఉండటంతో వరుసగా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కరీంనగర్, నిజామాబాద్, ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడ కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి Indian Currency: 100, 200 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకులకు కీలక ఆదేశాలు!
ఏపీలో భారీ వర్షాలు
ఇక ఏపీలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో ఆరు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.
దేశంలో మరోసారి వరుణుడు కుండపోతగా వానలు కురిపిస్తున్నాడు. ఎక్కడ చూసిన కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా భారీగా కురుస్తున్న వానలకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చిగురు టాకుల్లావణికిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నిజలమయం అయిపోయాయి.
ఇది కూడా చదవండి: Hyderabad Richest People: హైదరాబాద్‌లో టాప్ ధనవంతులు వీరే.. ఏయే రంగాల్లో..
ఈ క్రమంలో తెలంగాణలో ఎక్కడ చూసిన కూడా రోడ్లన్ని చెరువుల్ని తలపిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అంతేకాకుండా.. సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారులకు కీలక సూచనలు చేశారు. చెరువులు సైతం తెగిపోయి నీళ్లన్ని గ్రామాల్లోకి చేరుతున్నాయి.
ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అనవసరంగా బైటకు రావొద్దని, మ్యాన్ హోల్స్, నాలాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి