Sachin Tendulkar: ఈ లేటెస్ట్ మూవీ సచిన్‌కు అంత బాగా నచ్చిందా? కన్నీళ్లు తెప్పించే ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే? – Telugu News | Sachin Tendulkar liked and praised Siddharth 3BHK movie streaming on Amazon Prime Video OTT

సచిన్ టెండూల్కర్..ఈ క్రికెట్ దేవుడు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి పుష్కర కాలం గడిచింది. అయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఏదో ఒక చోట ఈ క్రికెట్ దిగ్గజం పేరు వినిపిస్తుంటుంది. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా వీటి పనుల్లోనే నిమగ్నమయ్యాడు సచిన్. అయితే అప్పుడప్పుడు తీరిక దొరికినప్పుడల్లా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.. రీసెంట్ ఓ తమిళ సినిమా తనకెంతో నచ్చిందని సచిన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నెట్టింట యాక్టివ్ గా ఉండే మాస్టర్ బ్లాస్టర్ తాజాగా రెడిట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ యూజర్ ‘సినిమాలు తరచూ చూస్తారా? సార్.. మీ ఫేవరేట్ మూవీ ఏదీ’ అని సచిన్ ను అడిగాడు. దీనికి ఆయన బదులిస్తూ.. ‘నాకు టైమ్ దొరికినప్పుడల్లా సినిమాలు చూస్తుంటాను. రీసెంట్ టైమ్స్ లో నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమాలు 3బీహెచ్‌కే, ఆట తంబాయ్చా నాయ్’ అని రిప్లై ఇచ్చారు. 3బీహెచ్‌కే అనేది సిద్ధార్థ్ నటించిన తమిళ్ మూవీ కాగా, ఆట తంబాయ్చా నాయ్ అనేది మరాఠీ మూవీ.

కాగా సచిన్ తమ సినిమా నచ్చిందని చెప్పడంతో 3బీహెచ్‌కే డైరెక్టర్ శ్రీ గణేష్ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఎక్స్ లో సచిన్ కు థ్యాంక్యూ చెప్పాడు. ‘3బీహెచ్‌కే’ సినిమాలో సిద్ధార్థ్ తో పాటు శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషించాడు. అలాగే గుడ్ నైట్ మూవీ ఫేమ్ మీతా రఘునాథ్, దేవయాని, చైత్ర జె ఆచార్, యోగి బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది జులైలో థియేటర్లలో రిలీజైన ఈ ఎమోషనల్ డ్రామా ఆడియెన్స్ సూపర్ హిట్ గా నిలిచింది. తండ్రి కల నెరవేర్చేందుకు సొంత ఇల్లు కోసం పాటు పడే కొడుకు కథగా ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించింది.

ఇవి కూడా చదవండి

సచిన్ కు ధన్యవాదాలు తెలిపిన  3బీహెచ్‌కే డైరెక్టర్..

సచిన్ టెండూల్కర్ కు నచ్చిన ఈ తమిళ ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు వెర్షన్ లోనూ ఈ సినిమాను అందుబాటులో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment