Rishabh Pant : భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా అతను ఆసియా కప్ 2025కు సెలక్ట్ కాలేదు. ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలో అతని కాలు విరిగింది. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌తో పంత్ మళ్లీ జట్టులోకి వస్తాడని సమాచారం. అయితే, ఈసారి అతని గురించి ఒక వింత విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే.. పిజ్జా!
పిజ్జాపై పంత్ కొత్త నిర్ణయం
పిజ్జా గురించి పంత్ చెప్పిన విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. పిజ్జా తినకపోవడం వల్ల అతనికి రెండు గంటల సమయం ఆదా అవుతుందట. ఈ విషయం తెలిస్తే పంత్ ఎంత ఫిట్‌నెస్ ఫ్రీకో అర్థమవుతుంది. పంత్ పిజ్జా తినడం ఎందుకు మానేశాడో అతని మాటల్లోనే తెలుసుకుందాం.
పిజ్జా తినకపోతే రెండు గంటలు ఆదా
రిషబ్ పంత్ ప్రకారం.. ఒక పిజ్జా తింటే దానిలో ఉన్న క్యాలరీలను కరిగించడానికి అతను జిమ్‌లో రెండు గంటలు కష్టపడాలి. అందుకే, అతను పిజ్జానే తినకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పుడు జిమ్‌లో కష్టపడే రెండు గంటల సమయం ఆదా అవుతుంది కదా! ఆ రెండు గంటల సమయాన్ని అతను ఏదైనా మంచి పనికి ఉపయోగించుకోవచ్చు.
ఇంగ్లాండ్ టూర్‌లో పంత్ అద్భుత ప్రదర్శన
గాయపడకముందు ఇంగ్లాండ్ పర్యటనలో రిషభ్ పంత్ చాలా బాగా ఆడాడు. ఆ సిరీస్‌లో ఆడిన 4 టెస్ట్ మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. ఇంగ్లాండ్‌లో 7 ఇన్నింగ్స్‌లలో 68.42 సగటుతో 479 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 2 సెంచరీలు మరియు 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఒక టెస్ట్ తక్కువ ఆడినప్పటికీ, ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్‌లలో పంత్ నాలుగో స్థానంలో, ఓవరాల్‌గా ఆరో స్థానంలో నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..